Share News

పీ4 సర్వేపై వార్డుసభలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:09 AM

పబ్లిక్‌, ప్రైవేట్‌, ప్రజల భాగస్వా మ్యం (పీ4) సర్వేపై మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి ఆధ్వర్యం లో శనివారం బొబ్బిలిలోని 8 సచివాలయాల్లో వార్డు సభలను నిర్వహించారు.

  పీ4 సర్వేపై వార్డుసభలు

బొబ్బిలి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌, ప్రైవేట్‌, ప్రజల భాగస్వా మ్యం (పీ4) సర్వేపై మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి ఆధ్వర్యం లో శనివారం బొబ్బిలిలోని 8 సచివాలయాల్లో వార్డు సభలను నిర్వహించారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది నిరుపేద వర్గాలను నిర్దేశిత సూచికల ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు కమిషనర్‌ వివరించారు. పట్టణంలో మొత్తం 16 సచివాలయాలు ఉండగా శనివారం 8, ఆదివారం 8 సచివాలయాల్లో ఈ పీ4 సర్వే వార్డు సభలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. స్థానిక కంచరవీధి సచివాలయంలో ఆ వార్డు కౌన్సిలరు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. పక్కా ఇళ్లు, విద్యుత్‌, బ్యాంకు అకౌంట్‌, గ్యాస్‌ కనెక్షన్‌ వంటివి లేకుండా ఇంకా ఎటువంటి సంపాదన లేనివారిని గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే సర్వే ప్రక్రియను సక్రమంగా నిర్వహిం చాలని శరత్‌బాబు అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. ఈ వార్డు సభలలో ఐదో వార్డు కౌన్సి లరు వెలగాడ హైమావతి, మున్సిపల్‌ మేనేజరు పీటీవీ రాఘవా చార్యులు, డీఈఈ పి.కిరణ్‌కుమార్‌, టీపీఆర్‌వో ఎం.జగన్మోహనరావు, సచివాలయాల సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:09 AM