క్రీడాకారులకు సింగరేణిలో మంచి గుర్తింపు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:36 PM
క్రీడాకారులకు సింగరేణిలో మంచి గుర్తింపు ఉంటుందని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి
రెబ్బెన, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు సింగరేణిలో మంచి గుర్తింపు ఉంటుందని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. శనివారం గోలేటి టౌన్ షిప్‌లో శ్రీ భీమన్న స్టేడియంలో ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ తరుపున క్రీడా కారులు పోటీల్లో రాణించి సింగరేణికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన వేణుగోపాల్ స్మారకార్థం ఈ పోటీలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన హైదరాబాద్ జట్టుకు రూ.30వేలు, రన్నర్‌గా నిలిచిన బెల్లంపల్లి జట్టుకు రూ.20వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, డీజీఎంఐఈడీ ఉజ్వల్ కుమార్ బెహర, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డి ప్రశాంత్, ఆర్జీ-2 ఏరియా స్పోర్ట్స్ సూపర్ వైజర్ నరేందర్‌రెడ్డి, బెల్లంపల్లి రీజీయన్స్ స్పోర్ట్స్ సూపర్‌వైజర్ ఆశోక్, కోఆర్డినేటర్ కిరణ్ పాల్గొన్నారు.