P4 Irrigation Scheme Response: లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రసాద్ సీడ్స్.. చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:44 PM
P4 Irrigation Scheme Response: సీఎం చంద్రబాబు పిలుపు మేరకు కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ ముందకొచ్చింది. సొంత డబ్బులతో లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించనున్నట్లు ప్రసాద్ సీడ్స్ అధినేత వెల్లడించారు.

అమరావతి, ఏప్రిల్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పిలుపుతో పీ4కు అనూహ్య స్పందన వస్తోంది. సొంత డబ్బులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ (Prasad Seeds) సంసిద్ధత వ్యక్తం చేసింది. లిఫ్ట్ స్కీం నిర్మాణానికి రూ. 10 కోట్ల వితరణ ఇస్మని ప్రసాద్ సీడ్స్ చైర్మన్ ప్రసాద్ వెల్లడించారు. కొమ్మమూరు లిఫ్ట్‌తో కాకుమాను మండలంలో 5,315 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పారు. రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రసాద్ ఔదారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ప్రసాద్ సీడ్స్‌తో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ అంగీకార పత్రం ఇచ్చారు.
సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వండి: చంద్రబాబు
నేడు (శనివారం) ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తూ పీ4 విధానాన్ని మరోసారి ప్రస్తావించారు. మన ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమంలో ముందుకు వస్తున్నామన్నారు. బంగారు కుటుంబం కింద ఎంపికైన వారి ఇంటికి వెళ్లి మాట్లాడానని.. వారు ఆర్ధికంగా అన్ని విధాలా ఎదిగేందుకు చేయూతను ఇస్తున్నామని తెలిపారు. తాము చేపట్టే కార్యక్రమాలను అర్థం చేసుకుంటే బాగు పడతారని... లేదంటే వాళ్లే వెనక్కి వెళతారని అన్నారు. సమాజంలో కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుని చాలా మంది పైకి వచ్చారన్నారు. వారు మరికొంతమందికి చేయూతను ఇచ్చి పైకి తీసుకురావడమే పీ4 ఉద్దేశమని చెప్పుకొచ్చారు. బంగారు కుటుంబం కింద అట్టడుగున ఉండే 20శాతం వారికి పైన ఉండే పదిశాతం వారు సాయం అందించాలనేది తమ సంకల్పమన్నారు. భవిష్యత్‌లో తప్పకుండా ఇది మంచి ఫలితాలను ఇస్తుందని.. పేదలను ఆర్దికంగా ఎదిగేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో ఆర్ధికంగా పైకి ఎదిగిన వారంతా ఆలోచన చేయాలని.. సమాజానికి మీరు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Earthquakes: భూకంపాలకు హైదరాబాద్ సేఫెనా ..
పీ4 ప్రయోజనాలు
కాగా.. అట్టడుగున ఉన్న పేదవారి సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పీ4. ఉగాది నుంచి పీ4 జీరో పావర్టీ కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. 2024 నాటికి ప్రజలను ఆదాయంలో వరల్డ్ నెంబర్ 1గా నిలపాలనే ఉద్దేశంతో పీ4ను తీసుకొచ్చారు సీఎం. సంపద ఉన్న వారు అట్టడుగున కుటుంబాలకు మద్దతుగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముందుగా నాలుగు గ్రామాల్లో ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టగా.. దాదాపు 5869 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలో సర్వే మొదలు పెట్టగా.. ఇందులో అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు. లబ్దిదారుల ధృవీకరణ పత్రాలను సమృద్ధి బంధనమ్ ఫ్లాట్‌ఫాంలో ఉంచుతారు. లబ్దిపొందాల్సిన కుటుంబాలను సాయం చేసే కుటుంబాలతో అనుసంధానం చేయడమే పీ4 విధానంలో సర్కార్ పాత్ర ఉంటుంది. ప్రభుత్వం నేరుగా ఆర్థిక కలాపాలను నిర్వహించదు. ఈ విధానంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి మేలు జరిగే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News