Shami Sister in MGNREGA Job List: ఉపాధి కూలీల జాబితాలో షమి సోదరి
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:45 AM
భారత క్రికెటర్ షమి సోదరి షబీనా, ఆమె భర్త పేర్లు ఉపాధి హామీ కూలీల జాబితాలో నమోదై ఉన్నాయి.

న్యూఢిల్లీ, మార్చి 26: భారత క్రికెటర్ షమి సోదరి షబీనా, ఆమె భర్త పేర్లు ఉపాధి హామీ కూలీల జాబితాలో నమోదై ఉన్నాయి. అంతేకాదు, వీరు 2021-24 మధ్య కాలంలో ప్రతీ ఏడాది ఈ పథకం కింద కూలీ పని చేసి, వేతనాలు పొందినట్లు రికార్డులున్నాయి. ఏబీపీ వార్తా సంస్థ ఆ రికార్డులతో కథనాన్ని ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరోహాలో వీరిద్దరి పేర్లు ఉపాధి కూలీలుగా నమోదై ఉన్నట్లు తెలిపింది. ఇటీవల భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు షమి తల్లి, సోదరి మైదానంలో టీమిండియాతో సంబరాల్లో పాలుపంచుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..