Share News

Excise Department: రాబడికి నూతన మార్గాలు!

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:12 AM

ఎక్సైజ్‌ శాఖ, కొత్త బార్లను పునరుద్ధరించటం, రిటైల్‌ మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వటం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. 2025-26లో రూ.27,623 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న ఈ శాఖ, మద్యం, బీర్ అమ్మకాల ద్వారా మరిన్ని ఆదాయం పొందాలని అంచనా వేస్తోంది.

Excise Department: రాబడికి నూతన మార్గాలు!

నిర్వహణలో లేని 25 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదాయం సమకూర్చుకొనేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్సైజ్‌ శాఖ అధికారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో డిఫంక్ట్‌(నాన్‌ రెన్యూడ్‌) అయిన 40 బార్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వల్ల ఆ ప్రాంతంలో మినహా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల 25 బార్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు రుసుం రూ.లక్ష చొప్పున నిర్ణయించి.. ఈ నెల 26వ తేదీ వరకు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. ఒక్కో బార్‌కు అక్కడి రాబడి ఆధారంగా చేసుకుని రూ.30 నుంచి రూ.44 లక్షల వరకు సంవత్సరం ఫీజు నిర్ణయించారు. ఇలా ఏడాదికి రూ.10 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా. ఆయా బార్లలో మద్యం, బీర్ల అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువే ఉంటుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2025-26లో రూ.27,623 కోట్ల ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి గత ఏడాదికంటే దాదాపు రూ.2 వేల కోట్ల వరకు అదనంగా లక్ష్యం నిర్ణయించారు. ఇటీవల బీర్ల ధరలు పెంచడంతో ప్రతి నెలా దాదాపు రూ.170 కోట్లకుపైగా ఆదాయం పెరుగుతుందని అంచనా. అంతేకాకుండా రాష్ట్రంలో అమ్మకాలు లేని దేశ, విదేశీ లిక్కర్‌, బీరు కంపెనీలు తమ బ్రాండ్ల మద్యం విక్రయించుకోవడానికి టీజీబీసీఎల్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 రిటైల్‌ మద్యం దుకాణాలు(ఏ4) ఉండగా.. వాటికి 2023-25 ఎక్సైజ్‌ సంవత్సరానికి కేటాయించిన గడువు కూడా ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుంది. నిర్ణీత గడువులోపు వాటికి నోటిఫికేషన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల విక్రయం ద్వారా దాదాపు రూ.250 కోట్లు, లెసెన్స్‌ ఫీజు రూపంలో ఏడాదికి మరో రూ.400 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ అఽధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:12 AM