Share News

Astro Tips : పాత బట్టలను దానం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..

ABN , Publish Date - Jan 13 , 2025 | 05:14 PM

దానం చేయడం తప్పు కాదు. కానీ, ఏలాంటివి దానం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. పాత బట్టలను దానం చేస్తున్నప్పుడు వాస్తు ప్రకారం ఈ విషయాలు గుర్తుంచుకోండి.

Astro Tips : పాత బట్టలను దానం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..
Donate Clothes

వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన బట్టల దగ్గర్నుంచి, మనం ఇంట్లో వాడే వస్తువులు, ఎప్పుడు ఏం కొనాలి, ఎలా అమ్మాలి, ఏ దిక్కున ఉంచాలి, ఏ దిక్కున వస్తువులు పెట్టకూడదు ఇలా అన్నీ వాస్తులో చెప్పబడ్డాయి. అయితే, పాత బట్టలను దానం చేస్తున్నప్పుడు ఎలాంటివి దానం చేస్తున్నాం? ఎలాంటివి దానం చేయడం మంచిది కాదు అనే విషయాలను తెలుసుకుందాం.

దానం చేయడం మంచిదే కానీ మీకు ఉన్నదంతా ఇష్టానుసారంగా వదులుకోకండి. ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ముందుగా తెలుసుకోవాలి.. దానధర్మాలు చేయడంలో ఉద్దేశం సరైనదే.. కానీ, దానిని సరైన మార్గంలో అనుసరించాలి. అయితే, పాత బట్టలు ఇచ్చే ముందు, గ్రంధాలలో పేర్కొన్న ఈ మాటలను అనుసరించండి..


పాత బట్టలను..

కొన్ని బట్టలు ఎక్కువ కాలం ధరించడం వల్ల పాతబడిపోతాయి. ఇంకొన్ని పెరిగే కొద్దీ చిన్నవిగా మారతాయి. కాబట్టి, అలాంటి బట్టలు మనం వేసుకోలేము. ఇంకొందరు తమ పాత బట్టలను చెత్త కుప్పల్లో పారేస్తారు. మరికొంత మంది ఇంటిని శుభ్రం చేయడానికి పాత బట్టలు ఉపయోగిస్తారు. మరికొందరు తమ పాత దుస్తులను దానం చేయడానికి ఇష్టపడతారు. మీరు మీ పాత బట్టలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, ముందుగా వాటిని ఉప్పు నీటిలో నానబెట్టండి. మూడు సార్లు బట్టలు ఉతికి ఆ తర్వాత దానం చేయడం చాలా మంచిది. కొంతమందికి పాత బట్టలతో ఇంటిని శుభ్రం చేసే అలవాటు ఉంటుంది. కానీ అలాంటివి ఇంటికి ప్రతికూల పరిణామాలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దోషాలు తొలగిపోతాయి..

చిరిగిన బట్టలు, వేసుకోవడానికి అసలు పనికి రాని విధంగా ఉన్న దుస్తులు దానం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కాస్త మంచిగా ఉన్న దుస్తులు మాత్రమే ఇవ్వాలి. మురికిగా ఉన్న బట్టలు అసలు ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం బట్టలు దానం చేయడం మంచిది కాదు. మీకు దానం చేయాలి అనుకుంటే పాత బట్టలు కాకుండా మంచి దుస్తులు కొని వారికి ఇవ్వండి. ముఖ్యంగా చలికాలంలో దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు వంటి దానం చేయడం చాలా మంచిది. వస్త్ర దానం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 13 , 2025 | 05:15 PM