చిన్న షేర్లదే హవా
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:43 AM
గత ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్లో చిన్న షేర్ల హవా కొనసాగింది. ప్రధాన కంపెనీల కంటే అధిక రిటర్నులు పంచాయి. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎ్‌సఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 5.10 శాతం వృద్ధి...

2024-25లో 8 శాతం పెరిగిన
బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ
మిడ్‌క్యాప్ సూచీ 5.61% అప్
సెన్సెక్స్ 5ు వృద్ధి కంటే అధికం
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్లో చిన్న షేర్ల హవా కొనసాగింది. ప్రధాన కంపెనీల కంటే అధిక రిటర్నులు పంచాయి. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎ్‌సఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 5.10 శాతం వృద్ధి చెందగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 8 శాతం ఎగబాకింది. మిడ్‌క్యాప్ సూచీ 5.61 శాతం పెరిగింది. గత అక్టోబరు నుంచి ఈ ఫిబ్రవరి వరకు వరుసగా ఐదు నెలల పాటు భారీగా దిద్దుబాటుకు లోనైన మార్కెట్ సూచీలు.. మార్చిలో మళ్లీ రివ్వున ఎగిశాయి. దీర్ఘకాలం పాటు అమ్మకాలకు పాల్పడిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లో కొనుగోళ్లు పెంచడంతో పాటు రిటైల్ మదుపర్ల దన్నుతో సూచీలు మళ్లీ కోలుకున్నాయి. మార్కెట్ రికవరీ ర్యాలీలోనూ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ప్రధాన సూచీని మించి వృద్ధి చెందాయి. మార్చిలో సెన్సెక్స్ 5.76 శాతం పెరగగా.. స్మాల్‌క్యాప్ సూచీ 8.25 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 7.61 శాతం పుంజుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుపొందడం, యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలతో 2024-25 ప్రథమార్ధంలో మార్కెట్లో రికార్డుల ర్యాలీ కొనసాగింది. గత ఏడాది డిసెంబరు 12న బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 57,827.69 వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెప్టెంబరు 24న మిడ్‌క్యాప్ సూచీ 49,701.15 వద్ద, అదే నెల 27న సెన్సెక్స్ 85,978.25 వద్ద సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి.
అయితే, దీర్ఘకాలిక బుల్‌రన్ కారణంగా చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితులు, కార్పొరేట్ కంపెనీల నిరాశాజనక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబరు నుంచి మన మార్కెట్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టారు. దాంతో ద్వితీయార్ధంలో మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. గత 29 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వరుసగా ఐదు నెలలు ప్రామాణిక సూచీలు భారీగా దిద్దుబాటుకు లోనయ్యాయి. కాకపోతే, ద్వితీయార్థం చివరి నెలలో మార్కెట్ మళ్లీ వేగం గా పుంజుకోవడంతో సూచీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్వల్ప వృద్ధినైనా నమోదు చేయగలిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీఎ్‌సఈ సెన్సెక్స్ 24.85 శాతం వృద్ధి చెందగా.. మిడ్‌క్యాప్ సూచీ ఏకంగా 62.38 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 59.60 శాతం ఎగబాకాయి.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా