ఇక ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ విధానం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:30 AM
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో నిర్వహణాపరమైన సమర్థతను సాధించి, వ్యయాలను హేతుబద్ధీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో ‘‘ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ’’ విధానం అనుసరించేందుకు రెడీ అవుతోంది...

ఇక ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ విధానం
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో నిర్వహణాపరమైన సమర్థతను సాధించి, వ్యయాలను హేతుబద్ధీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో ‘‘ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ’’ విధానం అనుసరించేందుకు రెడీ అవుతోంది. ఫలితంగా ప్రస్తుతం 43గా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి తగ్గుతుంది. ఆర్‌ఆర్‌బీల కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, తుదివిడత ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావచ్చని ఆర్థిక శాఖ వర్గాలంటు న్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం త్వరలోనే వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్‌ఆర్‌బీలను విలీనం చేసే ఆస్కారం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ గరిష్ఠంగా 4 ఆర్‌ఆర్‌బీలతో అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టా ల్లో మూడేసి, బిహార్, గుజరాత్, జమ్ము-కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో రెండేసి ఆర్‌ఆర్‌బీలున్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించే ప్రక్రియ పూర్తయింది. ఇందుకు నాందిగా ఆర్‌ఆర్‌బీలకు నిధుల కల్పన కూడా జరిగింది. ఆర్‌ఆర్‌బీల వృద్ధికి అవసరమైన మూలధనం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో రూ.5,445 కోట్ల నిధులను అందించింది.
ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌బీల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. ఆర్‌ఆర్‌బీలన్నింటి ఉమ్మడి నికరలాభం జీవితకాల గరిష్ఠ స్థాయిలో రూ.7,571 కోట్లుగా నమోదైంది. వాటి సీఏఆర్ కూడా ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆల్ టైమ్ గరిష్ఠం 14.2 శాతానికి చేరింది. స్థూల మొండి బకాయిలు పదేళ్ల కనిష్ఠ స్థాయి 6.1 శాతానికి దిగి వచ్చింది. ఆర్‌ఆర్‌బీల కన్సాలిడేషన్ ప్రక్రియను ప్రభుత్వం 2004-05 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి మూడు దశల్లో విలీనం చేయడంతో అప్పటికి 196గా ఉన్న ఆర్‌ఆర్‌బీలు ఇప్పుడు 43కి తగ్గాయి.
ఇవి కూడా చదవండి:
BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News

గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

క్రేజీ ఆఫర్..రూ.6కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇంకా..

50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఇలా చేస్తే చాలు..

ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా..ఈ కొత్త రేట్లు తెలుసా..

ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా
