వచ్చే ఏడాది 6.5ు%వృద్ధి ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:45 AM
భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5ు వృద్ధిని సాధించవచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అంచనా వేసింది. మానవ వనరుల అభివృద్ధికి సహాయపడే ఆర్థిక వ్యూహాలను...

వచ్చే ఏడాది 6.5ు%వృద్ధి ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5ు వృద్ధిని సాధించవచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) అంచనా వేసింది. మానవ వనరుల అభివృద్ధికి సహాయపడే ఆర్థిక వ్యూహాలను అనుసరించడంతో పాటు వివేకవంతమైన విత్త నిర్వహణ విధానాలు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయని తాజా నివేదికలో తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక వృద్ధిరేటు 6.4ు ఉండవచ్చని కూడా అంచనా వేసింది. వికసిత్ భారత్ దిశగా దేశం సాగించే పయనానికి మద్దతు ఇచ్చేలా విత్త విధానాన్ని అనుసంధానించవలసి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎ్‌సఓ అంచనా వేసిన విధంగా 6.5ు వార్షిక వృద్ధిని సాధించాలంటే మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికంలో 7.6% వృద్ధిని సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఇంత భారీ వృద్ధి ఇటీవల సంవత్సరాల్లో సాధ్యం కాలేదని తేల్చి చెప్పింది. ఇందుకు ప్రైవేట్ వినియోగ వ్యయం 9.9% అవసరమని కూడా పేర్కొంది. దీనికి బదులుగా పెట్టుబడి వ్యయాలు పెంచేందుకు కృషి చేయడం మంచిదని పేర్కొంది. దేశంలో పెరుగుతున్న యువజనాభాను పరిగణనలోకి తీసుకుంటే 2048 నాటికి విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6.5 శాతానికి పెంచాలని కూడా సూచించింది. ప్రస్తుతం ఈ వ్యయం 4.6ు ఉంది. అలాగే ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాలను 1.1% నుంచి 3.8 శాతానికి పెంచాల్సి ఉంటుందని తెలిపింది.
Read More Business News and Latest Telugu News