Share News

Bank Holiday: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఈ రోజు బ్యాంకులకు సెలవా..

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:33 AM

Bank Holiday: ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం మార్చి 31వ తేదీన రంజాన్ పండుగను పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఉండింది. అయితే, మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో .. ప్రభుత్వ లావాదేవీలు చూసుకునే బ్యాంకులు పనిచేశాయి.

Bank Holiday: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఈ రోజు బ్యాంకులకు సెలవా..
Bank Holiday

నిన్నటితో పాత ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హాలి డే క్యాలెండర్ ప్రకారం.. నిన్న రంజాన్ పండుగ కావటంతో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఉండింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో మార్చి 31న ఆ సెలవు రద్దు అయింది. ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులు మొత్తం పని చేయాల్సి వచ్చింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.


నిన్న ఓపెన్‌లో ఉన్న బ్యాంకులకు ఈ రోజు సెలవు ప్రకటించింది. మార్చి 31 ఓపెన్‌లో ఉన్న బ్యాంకులు .. ఈ రోజు ( ఏప్రిల్ 1)న సెలవులో ఉన్నాయి. ఈ నిర్ణయం అన్ని బ్యాంకులకు వర్తించదు. నిన్న సెలవు తీసుకున్న బ్యాంకులు ఈ రోజు ఓపెన్‌లో ఉంటాయి. ఇక, ఏప్రిల్ నెలలో వివిధ పండుగలు, కార్యక్రమాలను పురష్కరించుకుని పదికి పైగా సెలవులు వచ్చాయి. కొన్ని సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తే.. లోకల్ పండుగలు, కార్యక్రమాల కారణంగా దేశంలో పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.


ఈ నెలలో బ్యాంకు సెలవులు

ఏప్రిల్ 5, శనివారం : బాబు జగజ్జీవన రామ్ జయంతిని పురష్కరించుకుని శనివారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 10, బుధవారం : మహావీర్ జయంతిని పురష్కరించుకుని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 14 , సోమవారం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.

ఏప్రిల్ 15, మంగళవారం : బెంగాలీ కొత్త సంవత్సరం, హిమాచల్ డే, బోహగ్ బిహుల సందర్భంగా అస్సాం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 30, బుధవారం : బసవ జయంతిని పురష్కరించుకుని కర్ణాటక వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Stock Market Opening Bell: నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు, తర్వాత దూకుడు

Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

Updated Date - Apr 01 , 2025 | 12:01 PM