Share News

Brinjal Side Effects: వంకాయ కూర అంటే ఇష్టమా.. ముందుగా ఇది తెలుసుకోండి..

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:44 PM

Brinjal Health Benefits: వంకాయను మితంగా తీసుకోవాలి. ఈ కూరగాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో ఉండే మార్పులకు అనుగుణంగా వంకాయను తీసుకోవాలి. వంకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్పభావాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

Brinjal Side Effects: వంకాయ కూర అంటే ఇష్టమా.. ముందుగా ఇది తెలుసుకోండి..
Brinjal Health Benefits

వంకాయ కూర.. పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వంకాయతో చేసే వివిధ రకాల కూరలను భోజనప్రియులు ఎంతో ఇష్టంగా భుజిస్తారు. వంకాయ కూర మీద ఎన్నో సామెతలు కూడా ఉన్నాయి. అంత ఫేమస్ మరి వంకాయ. అంతేకాదండోయ్.. వంకాయ టేస్ట్ పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ భేష్ అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, ఇక్కడో చిన్న కండీషన్ అప్లై కూడా చేస్తున్నారు. వంకాయ ఇష్టంగా తినేవారు ఇది తప్పకుండా తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవును, వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. వాటి విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వంకాయ కూరతో అన్నం తిన్న తరువాత కొన్ని పదార్థాలు తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొరపాటున వాటిని తీసుకుంటే.. దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి వంకాయ తిన్న తరువాత వేటిని తీసుకోవద్దో ఈ కథనంలో తెలుసుకుందాం..


వంకాయతో పాటు వీటిని అస్సలు తీసుకోవద్దు..

వంకాయ కూరతో ఆహారం తిన్న తరువాత పొరపాటు కూడా పాలు తీసుకోకూడదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. వంకాయను పాలను వెంటవెంటనే తీసుకోవడంతో వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయట. వాస్తవానికి పాలు జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అప్పటికే మనం తిన్న వంకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇటు ఫైబర్ కంటెట్.. అటు పాలను ఒకేసారి తీసుకోవడం వలన ఈ రెండూ జీర్ణమవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఫలితంగా మలబద్దకం, కడుపు నొప్పి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. వీటితో పాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

బ్రేక్‌ఫాస్ట్‌‌తో పాటు పాలు తీసుకోవచ్చు. అప్పుడు పెద్దగా సమస్య ఉండదు. కానీ, అన్నం, వంకాయ కూర, పచ్చడి, పప్పుతో కూడిన భారీ భోజనం చేసిన తరువాత పాలు తీసుకోకూడదు. ఈ సమయంలో పాలు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇక చాలా మంది వంకాయ కూరతో అన్నం తిన్న తర్వాత పెరుగు తింటుంటారు. ఇలా చేయడం కూడా సరైనది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రెండు కూడా వ్యతిరేక స్వభావాలను కలిగి ఉంటాయి. పెరుగు చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. వంకాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు అధికమవుతాయి.


టీ, కాఫీ కూడా..

చాలా మంది టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత కాఫీ లేదా టీ తాగుతారు. ఇది కూడా ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. ఇక వంకాయతో చేసిన ఆహారం తిన్న తరువాత కాఫీ గానీ, టీ గానీ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. టీ టానిన్ రిచ్ డ్రింక్. వంకాయతో అన్నం తిన్న తరువాత టీ తాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. అందుకే.. వంకాయ తిన్న తరువాత టీ, కాఫీ అస్సలు తాగకండి.


మాంసం, వంకాయ..

చాలా మంది వంకాయతో మాంసం కలిపి వండుతారు. కానీ, అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు ఆహారాలు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు అధికమవుతాయి. అందుే ఈ ఫుడ్ కాంబినేషన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని చెబుతున్నారు. ఇక ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు వంకాయలు తినకూడదని చెబుతున్నారు. వంకాయ తింటే శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుందట. అందుకే.. రక్తహీనత సమస్యతో బాధపడేవారు వంకాయను తినొద్దని సూచిస్తున్నారు.


Note: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏదైనా ఆహారం తినేముందు వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.


ఈ వార్తలు కూడా చదవండి...

Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..

Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Updated Date - Apr 04 , 2025 | 03:21 PM