Share News

రెనో చేతికి నిస్సాన్‌ ఇండియా వాటా

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:27 AM

భారత్‌లోని జాయింట్‌ వెంచర్‌ సంస్థ రెనో నిస్సాన్‌లో జపాన్‌ భాగస్వామి నిస్సాన్‌కు చెందిన వాటాలన్నింటినీ కొనుగోలు చేస్తున్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన ఆటో దిగ్గజం రెనో ప్రకటించింది. ప్రస్తుతం...

రెనో చేతికి నిస్సాన్‌ ఇండియా వాటా

న్యూఢిల్లీ: భారత్‌లోని జాయింట్‌ వెంచర్‌ సంస్థ రెనో నిస్సాన్‌లో జపాన్‌ భాగస్వామి నిస్సాన్‌కు చెందిన వాటాలన్నింటినీ కొనుగోలు చేస్తున్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన ఆటో దిగ్గజం రెనో ప్రకటించింది. ప్రస్తుతం ఈ జేవీలో నిస్సాన్‌కు 51ు వాటా ఉంది. ఈ వాటా కొనుగోలుతో ఈ సంస్థ పూర్తిగా రెనో సొంతం కానుంది. ఈ మేరకు ఉభయ సంస్థల మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినట్టు రెనో వెల్లడించింది. అయితే ఈ లావాదేవీ విలువ ఎంత అన్నది వెల్లడించలేదు. అయితే రెనో.. నిస్సాన్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ సెంటర్‌ ఇండియాను (ఆర్‌ఎన్‌టీబీసీఐ) మాత్రం ఉమ్మడిగానే నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ విభాగంలో నిస్సాన్‌కు 49ు, రెనో గ్రూప్‌నకు 51ు వాటాలున్నాయి.

ఇవి కూడా చదవండి..

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా

Updated Date - Apr 01 , 2025 | 03:27 AM