రెండు కార్వీ సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:51 AM
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్) నిర్వహణలోని రెండు సంస్థల రిజిస్ట్రేషన్లను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ రద్దు చేసింది...

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్‌సబీఎల్) నిర్వహణలోని రెండు సంస్థల రిజిస్ట్రేషన్లను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ రద్దు చేసింది. కార్వీ క్యాపిటల్ ఆల్టర్‌నేటివ్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్, కేసీఏపీ ఆల్టర్‌నేటివ్ ఇన్వె స్ట్‌మెంట్ ఫండ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు సంస్థలు నిబంధనలు తుంగలో తొక్కడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. సెబీ 2023 ఏప్రిల్‌లోనే కేఎ్‌సబీఎల్, దాని అనుబంధ కంపెనీలను ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News