Ministry of Coal Award: అరబిందో ఇన్‌ఫ్రాకు అవార్డు
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:17 AM
మౌలిక వసతుల రంగంలోని అరబిందో ఇన్‌ఫ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ‘‘ఎర్లీ ఆపరేషనలైజేషన్’’ విభాగంలో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. టక్లి జెనా బొలేరా బ్లాక్‌ను రెండు సంవత్సరాలలో పూర్తి చేసి, ఈ అవార్డును సాధించింది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మౌలిక వసతుల రంగంలోని అరబిందో ఇన్‌ఫ్రా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ‘‘ఎర్లీ ఆపరేషనలైజేషన్’’ విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అరబిందో ఇన్‌ఫ్రా మైనింగ్ విభాగం హెడ్ సంజయ్ వినోద్ మిశ్రా ఈ అవార్డును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అరబిందో ఇన్‌ఫ్రాకు ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణల్లో నాలుగు బొగ్గు బ్లాక్‌లతో పాటు మధ్యప్రదేశ్‌లో మూడు రాక్ ఫాస్ఫేట్ బ్లాక్‌లున్నాయి. ఇందులో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న టక్లి జెనా బొలేరా-ఉత్తర, దక్షిణ బొగ్గు బ్లాక్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మిగతా బ్లాక్‌ల అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి. టక్లి జెనా బొలేరా బ్లాక్‌ను కేవలం రెండు సంవత్సరాల రికార్డు వ్యవధిలోనే పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించినందుకు గాను ఈ అవార్డు లభించింది.