Miami Open 2025 Results: ఫెడరర్ రికార్డును.. దాటేసిన జొకోవిచ్
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:12 AM
నొవాక్ జొకోవిచ్ మియామీ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకుని, రోజర్ ఫెడరర్ రికార్డును అధిగమించాడు. 37 ఏళ్ల 10 నెలల జొకో, ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో అత్యధిక వయస్సులో సెమీ ఫైనల్‌కు చేరుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు

మియామీ గార్డెన్స్ (ఫ్లోరిడా) : నొవాక్ జొకోవిచ్ ఏడోసారి మియామీ ఓపెన్ టైటిల్ అందుకొనే దిశగా సాగుతున్నాడు. ఈక్రమంలో సెమీఫైనల్‌కు చేరుకున్న జొకో..స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును అధిగమించాడు. క్వార్టర్‌ఫైనల్లో సెబాస్టియన్ కోర్డాను 6-3, 7-6 (4) నొవాక్ ఓడించాడు. దాంతో 37 ఏళ్ల 10 నెలల జొకో..ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో అత్యధిక వయస్సులో సెమీ్‌సకు చేరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా..2019లో 37 ఏళ్ల ఏడు నెలల వయస్సులో ఫెడరర్ నెలకొల్పిన గత రికార్డు తుడిచి పెట్టుకుపోయింది.