Share News

Hyderabad: ఏటీఎం సెంటర్లే టార్గెట్‌.. అమాయకుల దృష్టి మరల్చి కార్డుల చోరీ

ABN , Publish Date - Jan 21 , 2025 | 08:22 AM

ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌, బహదూర్‌పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Hyderabad: ఏటీఎం సెంటర్లే టార్గెట్‌.. అమాయకుల దృష్టి మరల్చి కార్డుల చోరీ

- ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా

- ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

- రూ. 7.60 లక్షలు, 105 ఏటీఎం కార్డులు స్వాధీనం

- నిందితులపై నాలుగు రాష్ట్రాల్లో 18 కేసులు

హైదరాబాద్‌: ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌, బహదూర్‌పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీసీ అందె శ్రీనివాసరావు, ఏసీపీ జావీద్‌తో కలిసి దక్షిణ మండలి డీసీసీ స్నేహమెహ్రా వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన వకీల్‌ అలీ(45) కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చార్మినార్‌(Charminar) పరిసర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారం చేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: కండలు పెంచుకునేందుకు ఇంజక్షన్లు.. జిమ్‌లకు వెళ్లే వారే లక్ష్యంగా అక్రమంగా మందుల విక్రయం


అతడికి హరియాణాకు చెందిన ఇస్లామ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గుల్లూ ఫర్మాన్‌(23), నగరానికి చెందిన ఒబైద్‌ ఆరిఫ్‌ (30)తో పరిచయం ఏర్పడింది. వ్యాపారంలో వచ్చే ఆదాయం కుటుంబ పోషణ, విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో వకీల్‌ ఆధ్వర్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి పథకం వేశారు. సాయంత్రం వేళ్లలో ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులను టార్గెట్‌గా చేసుకొని మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డులు, పిన్‌ నంబర్లు సేకరించే వారు.


తరువాత తమ వద్ద ఉన్న నకిలీ కార్డులను బాధితులకు అప్పగించి అక్కడి నుంచి పారిపోయేవారు. మరో ప్రాంతంలో అపహరించిన కార్డులతో డబ్బులు డ్రా చేసి పంచుకునేవారు. ఇటీవల బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన అతియాఖాన్‌ అనే మహిళ ఏటీఎం కేంద్రానికి వెళ్లగా అప్పటికే అక్కడ మాటు వేసిన ముఠా సభ్యులు ఆమెకు సహాయం చేస్తామంటూ నమ్మించి ఏటీఎం కార్డు(ATM card)ను అపహరించారు. పిన్‌ నంబర్‌ తెలుసుకొని పలు ఏటీఎంల నుంచి రూ. 2,00,300 డ్రా చేశారు. ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు ఆమె ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితులు వకీల్‌ అలీ, ఫర్మాన్‌, ఒబైద్‌ ఆరి్‌ఫను సోమవారం అందుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు గుల్లూ, ఇస్లాం పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. నిందితులపై తెలంగాణలో పది, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, ఒడిశాలో నాలుగు, కర్ణాటకలో రెండు కేసులున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 7.60 లక్షలు, వివిధ బ్యాంకులకు చెందిన 105 ఏటీఎం కార్డులు, ద్విచక్రవాహనం, కారు, నకిలీ పోలీస్‌ ఐడీ కార్డు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 08:22 AM