Share News

Magha Masam: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:34 PM

Magha Masam: మాఘమాసం అంటేనే.. శుభకార్యాల మాసం అని అర్థం. ఈ మాసంలో అత్యధికంగా వివాహాలు జరుగుతాయి. ఈ మాసంలోనే ఇన్ని వివాహాలు జరగడానికి కారణం ఏమిటంటే..

Magha Masam: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

మాసాలు పన్నెండు ఉన్నా.. వాటిలో అత్యంత పవిత్రమైనవి శ్రావణం, కార్తీకం, మార్గశిరం, మాఘ మాసాలు. ఈ మాసాలు అత్యంత శ్రేష్టమైనవి. ముఖ్యంగా మాఘ మాసంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తే.. అరోగ్యం కుదుట పడుతోంది. అంతేకాదు.. ఈ మాఘమాసం శుభకార్యాలు అనువైన మాసం. ఈ మాసంలో వసంత పంచమి, రథ సప్తమి, భీష్మ ఏకాదశి, శివరాత్రి పర్వదినాలు వస్తాయి.

ఉత్తరాది పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో శ్రీమహా విష్ణువును పూజిస్తే మంచిదని శాస్త్ర పండితులు చెబుతారు. అలాగే ఈ మాసంలో నదీస్నానం చేస్తే శ్రేష్టమని వారు స్పష్టం చేస్తారు. ఇక ఈ నెలలో వచ్చే మాఘ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదంటారు. మాసంలో ఈ ఒక్క రోజు అయినా.. సముద్ర స్నానం చేసి హరిహరాదులను పూజించిన వారికి మోక్షం తప్పక లభిస్తోందని పెద్దలు పేర్కొంటారు.

MagaMasam.jpg

ఈ మాసం శుభకార్యాలకు నెలవు. ముఖ్యంగా వివాహాలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు.. ఇలా ఏ శుభకార్యం చేసిన మంచిదంటారు. అంతేకాదు.. ఇతర మాసాలతో పోలిస్తే.. ఈ మాఘ మాసంలో బలమైన మూహూర్తాలు ఉంటాయని శాస్త్ర పండితులు ఉవాచ. ఈ సమయంలో వివాహాలు జరిపిస్తే.. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ మాసంలో వివాహలు జరిపేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తారు.


చదువుల తల్లి సరస్వతి జన్మదినం వసంత పంచమి. అలాగే లోకానికి ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు జన్మదినం రథ సప్తమి ఈ మాసంలో వస్తాయి. అలాగే ఈ లోకానికి విష్ణు సహస్ర నామాలను అందించిన పంచమ వేదంలో కుృరు వృద్ధుడు భీష్మ పితామహుడు.. ఏకాదశి రోజు శివైక్యం చెందారంటారు. ఇక మాఘ మాసంలో ప్రతి ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధిస్తే.. శ్రేయస్కరమని అంటారు.


కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎలా పటిస్తామో.. అలాగే మాఘ మాసంలో మాఘ పురాణాన్ని 30 రోజుల పాటు పారాయణం చేయాలి. మాఘ మాస మహిమలను వివరించే మాఘ పురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


ఈ మాసంలోనే మహా శివరాత్రి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 9.48 గంటల వరకు త్రయోదశి ఉంది. అనంతరం చతుర్థశి ఘడియలు ప్రారంభమువతాయి. ఇక ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8.43 గంటల వరకు చతుర్థశి తిథి ఉంది. అయితే సూర్యోదయాన్ని తిథిని పరిగణలోకి తీసుకొంటాం. దీంతో ఫిబ్రవరి 27వ తేదీ శివరాత్రి జరుపుకోవాలి. కానీ లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ముఖ్యం కాబట్టి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారమే శివరాత్రి అని శాస్త్ర పండితులు సైతం పేర్కొంటున్నారు.

For Devotional News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:52 PM