Telangana Gandhi: వరంగల్ విమానాశ్రయానికి భూపతి కృష్ణమూర్తి పేరు
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:26 AM
తెలంగాణ గాంధీగా ప్రజలు పిలుచుకునే గొప్ప పోరాటశీలి భూపతి కృష్ణమూర్తి. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రీయాశీలకంగా పనిచేశారు.

తెలంగాణ గాంధీగా ప్రజలు పిలుచుకునే గొప్ప పోరాటశీలి భూపతి కృష్ణమూర్తి. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసిన పోరాటయోధుడు. తన ఆస్తులను ఉద్యమాలకే దారపోసిన ధీరోదాత్తుడు. ఆయన జీవితం అంతా పోరాటమే... బతుకంతా ఉద్యమాలే.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శ్వాసగా పనిచేశారు భూపతి కృష్ణమూర్తి. హయగ్రీవాచారితో కలిసి ఓరుగల్లు కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమయంలో రజాకార్ల దాష్టీకాన్ని కూడా చవి చూశారు. హైదరాబాద్ విమోచన పోరాటంలో చురుకుగా పాల్గొని అజ్ఞాత జీవితం గడిపారు. ఇడ్లీ సాంబార్ వ్యతిరేక ఉద్యమంలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు. 1953–54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను బలంగా వినిపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదేమోనని నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో యువకులు, మేధావి వర్గాలతో కలిసి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటుతో మరోసారి తెలంగాణ వాదులలో ఆశను రేకెత్తించారు.
1996 నవంబర్ 1న భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన వరంగల్‌లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సులో కాళోజీ నారాయణరావు, కొండా మాధవరెడ్డి, ఆచార్య జయశంకర్, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనా