ఏదీ నాటి ఆటల సంస్కృతి?
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:23 AM
గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అందరూ కలిసి గుంపులుగా ఆటలు ఆడుకునేవారు. కబడ్డీ, తొక్కుడు విల్లా, దాగుడుమూతలు ఇలా ఎన్నో ఆటలు ఆడుకునేవారు. ఆటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు మానసిక చురుకుదనం...

గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అందరూ కలిసి గుంపులుగా ఆటలు ఆడుకునేవారు. కబడ్డీ, తొక్కుడు విల్లా, దాగుడుమూతలు ఇలా ఎన్నో ఆటలు ఆడుకునేవారు. ఆటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు మానసిక చురుకుదనం, జట్టు స్ఫూర్తిని ఇస్తాయి. స్నేహ సంబంధాలు పెంపొందిస్తాయి. నేడు సాంకేతిక విప్లవం ప్రవేశించడం వలన పిల్లల ఆటలు కూడా హరించుకుపోయాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ వాళ్ల చేతిలోకి వచ్చాయి. ఇవన్నీ కూడా పిల్లలు ఇంటిపట్టునే ఉండి చూడడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. దీంతో పిల్లల్లో స్థూలకాయం, కంటి సమస్య, మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. జట్టుగా కలిసి ఆటను ఆడలేకపోవడం వల్ల స్నేహ సంబంధాలు సహనం వంటి మంచి సుగుణాలు కోల్పోతున్నారు.
కనుమరుగవుతున్న ఈ ఆటల ప్రాముఖ్యతను, వాటి సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలను బయట ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. పాఠశాలలు కూడా విద్యార్థులకు ఆటల పిరియడు ఆట స్థలాలను అభివృద్ధి చేయాలి కనుమరుగవుతున్న ఆటలను గురించిఅవగాహన కల్పించాలి.
సయ్యద్ షఫీ
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News