Share News

Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!

ABN , Publish Date - Jan 02 , 2025 | 10:05 AM

ఈ ఏడాది మీ జీవితం సమూలంగా మార్చుకోవాలని ఉందా? మెడిటేషన్‌తో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవితానికి కావాల్సిన మానసిన, శారీరక మేథో సామర్థ్యాలన్నీ ధ్యానంతో సంతరించుకోవచ్చని చెబుతున్నారు.

Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ ఏడాది తమ జీవితంలో సమూల మార్పులు ఆహ్వానించాలని తీర్మానించుకున్నారు. అయితే, పట్టుదల సడలి పాత తీరును కొనసాగిస్తామేమో అనే భయం కొందరిలో నెలకొంది. ఎంచుకున్న మార్గం తప్పకుండా లక్ష్యం చేరాలనుునే వారికి సాయపడే అద్భుతమైన సాధనం మెడిటేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క అలవాటుతో మనసుపై నియంత్రణ వచ్చి అనుకున్న పని అనుకున్నట్టుగా చేయొచ్చని భరోసా ఇస్తున్నారు.

ధ్యానానికి ఉన్న శక్తి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత వంటి లక్షణాలన్నీ ధ్యానంతో అందిపుచ్చుకోవచ్చు. ఫలితంగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు (Health).

Ice Cubes: ఐస్ క్యూబ్స్‌ను ఇలా వాడితే చర్మ సమస్యల నుంచి ఉపశమనం!


ఆధునిక జమానాలో మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒకానొక అంచనా ప్రకారం, ప్రపంచంలో 264 మిలియన్ మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఆందోళన, ఒత్తిడితో యువత సతమతమవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం మెడిటేషన్ అని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పని ధ్యానసాధనతో మనసు సమాధి స్థితికి చేరుకుంటుంది. అలర్ట్‌గా ఉంటూనే చుట్టు మారుతున్న పరిస్థితులకు తట్టుకునే నిలకడ అలవడుతుంది. మనసుకు ఈ స్థితి ధ్యానంతో సాధ్యమని శాస్త్రపరమైన అధ్యనాలు కూడా రుజువు చేశాయి.

కేవలం మానసిక ప్రయోజనాలే కాకుండా ధ్యానంతో సమాజానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ధ్యానం అలవాటున్న వారి సంఖ్య పెరిగే కొద్దీ నేరాల రేటు, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టడాన్ని నిపుణులు గమనించారు. కొందరి అలవాటు కారణంగా సమాజంలో వారి ప్రయోజనాలు వేగంగా విస్తరించినట్టు ఈ అధ్యయనాల్లో రుజువైంది.

Morning Walk Vs Evening Walk: మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్.. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలంటే..


మానసిక, సామాజిక ప్రయోజనాలతో పాటు మెడిటేషన్‌తో అనేక శారీరక లాభాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్న హృద్రోగ వ్యాధులకు మెడిటేషన్‌తో చెక్ పెట్టొచ్చు. నిత్యం ధ్యానం చేసే వారిలో బీపీతో పాటు కార్టిసాల్ స్థాయిలు అదుపులో ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ధ్యానం ద్వారా బీపీనీ ఏకంగా 10 పాయింట్ల మేర తగ్గించుకోవచ్చట.

ఇక ధ్యానంతో మెదడు సామర్థ్యాలు కూడా ఇనుమడిస్తాయి. ధ్యానంతో మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగానికి రక్త సరఫరా పెరుగుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యలను వేగంగా పరిష్కరించే సామర్థ్యం వటివి ఇనుమడిస్తాయి. ఆధునిక సాంకేతికతో ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను తట్టుకునేందుకు కావాల్సిన మానసిక, మేధో సామర్థ్యాలను ధ్యానంతో సంపాదించుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ రోజు నుంచే ధ్యానాన్ని మీ జీవితంలో ఓ ముఖ్య భాగంగా చేసుకోండి..

Read Latest and Health News

Updated Date - Jan 02 , 2025 | 10:11 AM