Share News

Nagavali Express: పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులంతా..

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:10 PM

Vizianagaram: విజయనగరం రైల్వేస్టేషన్‌కు దగ్గర్లో ప్యాసింజర్లతో వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది.. ప్రయాణికుల పరిస్థితి ఏంటి.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..

Nagavali Express: పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులంతా..
Nagavali Express

నాగావళి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వేస్టేషన్‌కు దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ట్రెయిన్ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటకలక్ష్మీ థియేటర్ కూడలి దగ్గర నాగావళి ఎక్స్‌ప్రెస్‌లోని చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రెయిన్ స్లోగా వెళ్లడంతో అందులోని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

హైకోర్టు మొట్టికాయలతో ఏసీబీ ముందుకు..

మ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు

తిరుమలలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2025 | 02:14 PM