Hotel Room Secrets: హోటల్ బాత్రూమ్‌లలో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎందుకు ఉంటాయి..అసలు కారణమిదే..
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:05 PM
Hotel Room Secrets: ఏ హోటల్‌కు వెళ్లినా గదుల్లో ఎప్పుడూ తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు కనిపిస్తాయి.. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నా ఇప్పటికీ హోటల్ బాత్రూంలల్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఎందుకు ఉంచుతారు.. ప్రపంచవ్యాప్తంగా చాలా హోటళ్లు ఇలాంటి రూల్స్ పాటించడం వెనక అసలు కారణమేంటి..

Why hotels have phones in bathrooms: తెలియని ప్రాంతాలకు వెళ్లినపుడు తప్పనిసరిగా హోటల్ రూం బుక్ చేసుకుంటారు ఎవరైనా. విచిత్రంగా ఊరు, భాష, అలవాట్లు, సంప్రదాయాలు అన్నింటిలో మార్పు కనిపించినా హోటల్ రూంలు మాత్రం ఎక్కడైనా దాదాపు ఒకేలాంటి రూల్స్ ఫాలో అవుతాయి. మీరు ఎప్పుడైనా హోటళ్లో బస చేసి ఉంటే హోటల్ గదుల్లో చాలా విషయాలు ఒకేలా ఉండటం గమనించే ఉంటారు. 5 స్టార్ హోటల్ లేదా 3 స్టార్ హోటల్ ఏది ఎంచుకున్నా రూంలో తెల్లటి బెడ్ షీట్లు తప్పకుండా ఉంటాయి. బాత్రూంలో ల్యాండ్‌లైన్ టెలిఫోన్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఈ స్మార్ట్ యుగంలోనూ బాత్రూంలో ల్యాండ్‌లైన్ ఫోన్ అవసరం ఏంటని కచ్చితంగా అనిపించే ఉంటుంది. కానీ వీటన్నింటి వెనక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా?
హోటల్ బాత్రూమ్‌లలో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎందుకు ఉంటాయి?
చిన్న హోటళ్లు మొదలుకుని లగ్జరీ హోటళ్ల వరకూ చాలా చోట్ల బాత్రూంలో ల్యాండ్‌లైన్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నిజానికి, 1990ల కంటే ముందు నుంచే ఉంది. ఆ సమయంలో లగ్జరీ హోటళ్లు దీన్ని హోదాకు చిహ్నంగా భావించేవి. అదీగాక అప్పట్లో ప్రజలకు మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి అతిథులకు ప్రీమియం సౌకర్యాలు అందించాలని బాత్రూమ్‌లలో ల్యాండ్‌లైన్ ఫోన్‌లను ఉంచేవారు. అందువల్ల బాత్రూంలో ఉన్నప్పుడు రూమ్ సర్వీస్ కాల్ వస్తే రిసీవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌గా ఉపయోగపడుతుంది. ఇదేకాక అతిథులు ముఖ్యమైన కాల్స్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేసేవారు. 4 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో ఈ నియమాలు అనుసరించడానికి గల మరో కారణం బాత్రూం ఫోన్లు హోటళ్ల స్టార్ రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయి.
మొబైల్ ఫోన్లు ఉన్నా ఇప్పటికీ ఎందుకు?
స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ చాలామందికీ బాత్రూంకు ఫోన్ తీసుకెళ్లే అలవాటుండదు. కొన్ని సందర్భాల్లో అతిథులు బాత్రూంలో ఆకస్మిక అనారోగ్యానికి గురైనా, కాలు జారిపడటం లేదా పడిపోవటం జరగవచ్చు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో టెలిఫోన్ లగ్జరీ ఫీచర్‌గా కాక హెల్ప్ లైన్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తుంది.
హోటల్ గదుల్లో తెల్లటి బెడ్‌షీట్లు ఎందుకు వేస్తారు?
హోటల్ గదుల్లో బెడ్‌షీట్లు ఎప్పుడూ తెల్లనివే వాడటం వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది. హోటల్ గదులలోని బెడ్‌షీట్లు నుంచి రసాయనాల వాసన వస్తుంటుంది. వాటిని తడి గుడ్డ తీసుకుని తుడిచివేస్తే కొన్ని అవశేషాలు కనిపిస్తాయి. ఇది బ్లీచ్, క్లోరిన్ వల్ల జరుగుతుంది. ఇందుకో కారణముంది. అతిథులు హోటల్ రూం వెకేట్ చేశాక చాలా హోటళ్లలో బెడ్‌షీట్లను చేతితో లేదా వాషింగ్ మెషీన్లో ఉతకరు. బ్లీచ్ చేసి శుభ్రంగా మారుస్తారు. తెల్లటి రంగు కాక వేరే రంగులైతే బ్లీచింగ్ చేయగానే రంగు వెలసిపోతాయి. అందుకనే తెలుపు రంగువి ఉపయోగిస్తారు.
Read Also: Scorpion farming: తేలు విషానికి ఎందుకంత డిమాండ్..ఈ వీడియో చూస్తే అసలు మ్యాటర్ మీకే అర్థమవుతుంది..
Jugad Viral Video: బెడ్‌పైనే షికారు.. ఇతడి టాలెంట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..