Share News

Waqf Bill controversy: వక్ఫ్‌ బిల్లుపై వైసీపీ వంచన

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:39 AM

వక్ఫ్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని టీడీపీ ఆరోపించింది. లోక్‌సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో మద్దతు తెలిపిన జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు నాయకులు నాగుల్ మీరా, నక్కా ఆనంద్‌బాబు.

Waqf Bill controversy: వక్ఫ్‌ బిల్లుపై వైసీపీ వంచన

రాజ్యసభలో మద్దతివ్వడం జగన్‌ నీచ రాజకీయాలకు నిదర్శనం

తల్లీచెల్లినే మోసం చేశారు.. ముస్లింలను మోసగించడం ఓ లెక్కా

టీడీపీ నేతలు నాగుల్‌ మీరా, ఆనంద్‌బాబు ధ్వజం

అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బిల్లుపై వైసీపీ మోసపూరితంగా వ్యవహరించిందని టీడీపీ మండిపడింది. లోక్‌సభలో వ్యతిరేకించి.. రాజ్యసభలో మద్దతు పలకడం జగన్‌ నీచ రాజకీయాలకు అద్దం పడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ముస్లిలకు కూటమి ప్రభు త్వం అండగా ఉంటుందని నాగుల్‌ మీరా అన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆకాంక్షతో అన్ని వర్గాలతోపాటు ముస్లింలు కూడా టీడీపీ కూటమికి అండగా నిలిచారన్నారు. వక్ఫ్‌ బిల్లులో ముస్లింలకు ఇబ్బందికరంగా ఉన్న మూడు అంశాలపై చంద్రబాబు దృష్టి సారించి, వాటికి సవరణలు ప్రతిపాదించారని అన్నారు. మాట తప్పడం మడమ తిప్పడం జగన్‌ పేటెంట్‌ అని, రాజ్యసభ సాక్షిగా ముస్లింలకు ద్రోహం చేశాడని ఆనంద్‌బాబు విమర్శించారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన ఆయనకు.. ఓట్ల కోసం ముస్లింను మోసం చేయడం పెద్ద లెక్కేమీ కాదన్నారు. మోదీ అరెస్టు చేయిస్తారనే భయం ఓ వైపు.. ముస్లిం ఓట్లు పోతాయనే భయం మరోవైపు.. జగన్‌ను ప్రభావితం చేయడంతో లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించి రాజ్యసభలో బిల్లుకు మద్దతు పలికారని అన్నారు.

జగన్‌ ద్వంద్వనీతి బయటపడింది: షిబ్లీ

వక్ఫ్‌ బిల్లుపై వైసీపీ డ్రామాలాడుతోందని రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ ధ్వజమెత్తారు. ఎన్డీయేకు బలం ఉన్న లోక్‌సభలో వ్యతిరేకించి, బలం లేని రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందని.. జగన్‌ ద్వంద్వ నీతి రాజకీయం మరోసారి బయటపడిందని దుయ్యబట్టారు. బిల్లుకు రాజ్యసభలో మద్దతుగా ఓటేసిన వైసీపీ ఎంపీలు.. బయటికొచ్చాక వ్యతిరేకించినట్లు చెబుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకమన్న వైసీపీ.. రాజ్యసభలో సైలెంట్‌గా మద్దతు పలికిందని ఆక్షేపించారు. మైనారిటీలపై జగన్‌ తీరు, వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ముస్లింలు మండిపడుతున్నారని షిబ్లీ తెలిపారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:39 AM