Char Dham Yatra 2025: 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:58 AM
ఈ నెల 30న ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది, అదే రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకుంటాయి. యాత్రికుల భద్రత కోసం 6 వేల మందికి పైగా సిబ్బందితో కూడిన భద్రతా బలగాలను మోహరించి, ప్రత్యేక కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ ప్లాన్‌లు రూపొందించారు.

6 వేల మంది సిబ్బందితో పటిష్ఠ ఏర్పాట్లు
డెహ్రాడూన్, ఏప్రిల్ 5: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత చార్‌ధామ్ యాత్ర ఈనెల 30న ప్రారంభం కానుంది. అదే రోజు గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకుంటాయి. దీంతో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 137 సెక్టార్లుగా వర్గీకరించారు. భద్రత, రవాణా ఏర్పాట్లు పర్యవేక్షించడానికి 6 వేల మందికి పైగా పోలీసు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఈ విషయాన్ని గర్హ్వాల్ ఐజీ స్వరూప్ శనివారం మీడియాకు తెలిపారు. ప్రతి సెక్టార్ 10 కిలోమీటర్ల పరిఽధిలో విస్తరించి ఉంటుందని, భద్రతా సిబ్బంది 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. రేంజ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చార్‌ధామ్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ నిఘా పెంచారు. ట్రాఫిక్ వ్యవస్థకోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. యాత్రికుల కోసం వికా్‌సనగర్‌లో బస ఏరాట్లు చేస్తున్నారు. సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక అధికారిని నియమించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News