Share News

Kodanadu: కొడనాడు వ్యవహారంలో ఇంటర్‌ పోల్‌ నివేదిక

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:54 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ హత్యకు సంబంధించి ‘ఇంటర్‌పోల్‌’ విచారణ నివేదిక కోసం వేచి ఉన్నామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. జయలలితకు ఊటీ సమీపంలో కొడనాడు ఎస్టేట్ పేరుతో పెద్దపెద్ద భవనాలున్నాయి.

Kodanadu: కొడనాడు వ్యవహారంలో ఇంటర్‌ పోల్‌ నివేదిక

చెన్నై: కొడనాడు(Kodanadu) హత్యకు సంబంధించి ‘ఇంటర్‌పోల్‌’ విచారణ నివేదిక కోసం వేచి ఉన్నామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. ఊటీ సెషన్స్‌ కోర్టులో కొడనాడు హత్య, దోపిడీ కేసు విచారణ సాగుతోంది. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణ సీబీసీఐడీ(CBCID)కి అప్పగించారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి మురళిధరన్‌ విచారించారు. ఈ కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న జితిన్‌జాయ్‌ విచారణకు హాజరయ్యాడు.

ఈ వార్తను కూడా చదవండి: Leopard: మళ్లీ.. చిరుత సంచారం..


nani4.jpg

హత్య, దోపిడీ కేసు విచారణ కొనసాగుతోందని, ఇంటర్‌పోల్‌(Interpol) విచారణ నివేదిక ఇంకా లభించలేదని, అందువల్ల అదనపు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు షాజహాన్‌, కనకరాజ్‌ న్యాయమూర్తిని అభ్యర్థించారు. ప్రభుత్వ విజ్ఞప్తి పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 23వ తేదీకి వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.


nani4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 01:54 PM