Share News

Minister: తెలుగులో మాట్లాడినా మావైపు కన్నెత్తి చూడరు..

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:08 PM

నేను తమిళంతోపాటు తెలుగు కూడా మాట్లాడినా మాజీ స్పీకర్‌ తనవైపు కన్నెత్తి కూడా చూడలేదని రాష్ట్ర నగర పాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయా అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

Minister: తెలుగులో మాట్లాడినా మావైపు కన్నెత్తి చూడరు..

- పొల్లాచ్చి జయరామన్‌పై మంత్రి నెహ్రూ ఎద్దేవా

చెన్నై: తమిళంతోపాటు తెలుగులో మాట్లాడినా మాజీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌(Former Speaker Pollachi Jayaraman) తనవైపు కన్నెత్తి చూడలేదని నగర పాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) యెద్దేవా చేశారు. శాసనసభలో గురువారం ఉదయం పొల్లాచ్చి జయరామన్‌ మాట్లాడుతూ.. పొల్లాచ్చి నగరంలో భూగర్భ డ్రైనేజీ పథకంలో 22వేల ఇళ్ళకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఏడువేల ఇళ్ళకు మాత్రమే ఇచ్చారని, తక్కిన ఇళ్ళకు కూడా కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. సీఎం ఆగ్రహం


nani2.jpg

మంత్రి కేఎన్‌ నెహ్రూ సమాధానమిస్తూ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొల్లాచ్చి జయరామన్‌ డిప్యూటీ స్పీకర్‌గా తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, చివరకు ఆయనకు బాగా తెలిసిన తెలుగు(Telugu)లో మాట్లాడినా ప్రయోజనం లేదని యెద్దేవా చేయడంతో సభలో అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్ష సభ్యులు గొల్లుమన్నారు. ఆ తర్వాత మంత్రి నెహ్రూ మాట్లాడుతూ పొల్లాచ్చిలో పెండింగ్‌లో ఉన్న 15 వేల మందికి త్వరలోనే భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Online Betting: ముదిరిన బెట్టింగ్‌ వ్యవహారం.. తారలపై కేసులు

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2025 | 12:08 PM

News Hub