Amul: అమూల్ పాల ధర తగ్గింపు
ABN , Publish Date - Jan 24 , 2025 | 05:21 PM
తగ్గించిన ధరల ప్రకారం, అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66 (పాతధర) నుంచి రూ.65 (కొత్తధర)కు, అమూల్ తాజా రూ.54 నుంచి రూ.53కు, అమూల్ టీ స్పెషల్ రూ.62 నుంచి 61కి అందుబాటులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ (Amul) ధరల్ని తగ్గించింది. కంపెనీ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్‌పై లీటరుకు రూ.1 చొప్పున తగ్గించినట్టు ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చినట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా తెలిపారు.
Train Accident: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
తగ్గించిన ధరల ప్రకారం, అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66 (పాతధర) నుంచి రూ.65 (కొత్తధర)కు, అమూల్ తాజా రూ.54 నుంచి రూ.53కు, అమూల్ టీ స్పెషల్ రూ.62 నుంచి 61కి అందుబాటులోకి వచ్చింది. అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల హైక్వాలిటీని కొనసాగిస్తూ వినియోగదారులకు మరింత లబ్ది చూకూర్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు జయేన్ మెహతా ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
కాగా, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో అమూల్ పాల ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. లీడింగ్ డెయిరీ బ్రాండ్‌లలో ఒకటైన అమూల్ దేశంలో కోట్లాది మందికి పాల సరఫరాలో కీలకంగా ఉంది. గుజరాత్ వ్యాప్తంగా 3.6 మిలియన్ల రైతులు స్వయం ఉపాధి పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News