
Breaking News: దోపిడి, మోసాలను ఆపడమే వక్ఫ్ బిల్లు ఉద్దేశం..
ABN , First Publish Date - Apr 03 , 2025 | 10:23 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-03T19:29:09+05:30
ఆస్తులను లాక్కునే ప్రయత్నమిది: ఎస్పీ నాయకుడు
వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రధాన ఆస్తులను లాక్కోవాలని భావిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి అమీక్ జమీ ఆరోపించారు. ఈ ఆస్తులను పెట్టుబడిదారులకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు అని పేర్కొన్నారు. కిరణ్ రిజిజు మన దేశ మైనారిటీ వ్యవహారాల మంత్రి. ఈ సవరణ ముస్లింలలోని పేదరికాన్ని తరిమికొడుతుందని ఆయన అంటున్నారు. కానీ, ఇది ఎంతమాత్రం నిజం కాదు. భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వం మఠాలు, తీర్థాలకు చెందిన వేల కోట్ల విలువైన ఆస్తులపై కూడా దృష్టి సారిస్తుందా. రేపటి రోజున సిక్కులు పేదలు అని చెప్పుకుంటూ గురుద్వారా ప్రబంధక్ కమిటీల ఆస్తులపై కూడా దృష్టి పెడతారు. పేదరికాన్ని నిర్మూలించడానికి వక్ఫ్ ఒక ఉద్యమం కాదు. 90 శాతం వక్ఫ్ ఆస్తులపై స్మశానవాటికలు, మసీదులు ఉన్నాయి’ అని అమీక్ చెప్పుకొచ్చారు.
-
2025-04-03T19:23:13+05:30
దోపిడి, మోసాలను ఆపడమే వక్ఫ్ బిల్లు ఉద్దేశం..
వక్ఫ్ సవరణ బిల్లు అంశంపై హర్యానా మంత్రి అనిల్ విజ్ మాట్లాడారు. మోసం, దొంగతనాలను నిరోధించడానికి ఉద్దేశించిన ముఖ్యమైన బిల్లు ఇది అని అన్నారు.
-
2025-04-03T15:48:58+05:30
వక్ఫ్ బోర్డు పేరిట ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..
భారతదేశంలో వక్ఫ్ బోర్డు పేరిట 8.72 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. నేటికి 8.72 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 2006లో సచార్ కమిటీ 4.9 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ నుండి వచ్చే ఆదాయాన్ని రూ. 12,000 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్‌ను ఎంత ఆదాయాన్ని సృష్టిస్తున్నాయో మీరే అంచనా వేసుకోవచ్చు అని అన్నారు.
-
2025-04-03T15:36:48+05:30
ల్యాండ్ మాఫియాలా వక్ఫ్ బోర్డ్: బీజేపీ ఎంపీ
వక్ఫ్ బోర్డు గతంలో ల్యాండ్ మాఫియా లాగా పని చేసిందని బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మదీ ముస్లింలకు సాధికారత కల్పిస్తున్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూమాఫియాలా పని చేసేదన్నారు. దాని చేతిలో పెట్టిన ఏ ఆస్తిని మింగేసేవారని వ్యాఖ్యానించారు.
-
2025-04-03T13:02:00+05:30
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ
-
2025-04-03T12:39:51+05:30
రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు
రాజ్యసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ప్రశ్నోత్తరాల తర్వాత వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
రాజ్యసభలోనూ 8 గంటల పాటు చర్చించాలని నిర్ణయం
-
2025-04-03T11:27:26+05:30
రాజ్యసభలో టెన్షన్ వాతావరణం
రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
రాజ్యసభకు చేరుకున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
ఇప్పటికే వక్ప్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కిరణ్ రిజిజు మాట్లాడుతుండగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ రన్నింగ్ కామెంట్రీ
టీఎంసీ ఎంపీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సీరియస్
మీరు మాట్లాడండంటూ సీటులో కూర్చున్న కిరణ్ రిజిజు
ఒబ్రెయిన్ రన్నింగ్ కామెంట్రీపై కిరణ్ రిజిజు ఆగ్రహం
వెంటనే కలుగజేసుకున్న రాజ్యసభ ఛైర్మన్
సభా సంప్రదాయాలు పాటించాలంటూ సభ్యులకు సూచించిన ఛైర్మన్
సభా సంప్రదాయాలను వివరించిన ఛైర్మన్
మీడియా దృష్టిని ఆకర్షించేలా సభ్యుల తీరు ఉండకూడదు
మీడియా దృష్టిని ఆకర్షించడం సభ్యుడి ప్రధాన ఉద్దేశం కాకూడదు
-
2025-04-03T10:23:28+05:30
రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు
ఇవాళ రాజ్యసభలో వక్ఫ్‌బిల్లుపై చర్చ
ఇప్పటికే వక్ఫ్‌బిల్లును ఆమోదించిన లోక్‌సభ