Nitish Kumar Assurance: ఇక మీ జట్టు వీడం
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:54 AM
బిజెపి నుంచి మరోసారి దూరం కావడం పగఫెళ్లా అని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అమిత్‌షాకు హామీ ఇచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్‌షా, నితీశ్ కుమార్ కలిసి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు

అమిత్‌షాకు నితీశ్ కుమార్ హామీ
పట్నా, మార్చి 30: బీజేపీతో మరోసారి తెగదెంపులు చేసుకొనే ప్రసక్తే లేదని జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు హామీ ఇచ్చారు. గతంలో రెండుసార్లు బీజేపీ నుంచి దూరమవడం పొరపాటున జరిగిందని, దానికి తమ పార్టీలోని కొందరు కారణమని తెలిపారు. మరోసారి అలా చేయబోనని తేల్చిచెప్పారు. ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్‌తో కలిసి రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం అమిత్‌షా ప్రారంభించారు. అయోధ్యలో రామజన్మభూమి తరహాలోనే సీతాదేవి జన్మస్థలమైన బిహార్‌లో ఆమె గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోందని అమిత్‌షా చెప్పారు. కాగా, నితీశ్‌నివాసంలో ఆదివారం సాయంత్రం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో అమిత్‌షా కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు
Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్
Yatnal: కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా
For National News And Telugu News