Share News

Judges Mass Transfer: 582 మంది జడ్జీల సామూహిక బదిలీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 09:44 PM

హైకోర్టు రిజిస్టర్ జనరల్ రాజీవ్ భారతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ బదిలీలను ప్రకటించారు. బదిలీ అయిన న్యాయమూర్తుల్లో 236 మంది అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిలు, 207 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు, 139 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు.

Judges Mass Transfer: 582 మంది జడ్జీల సామూహిక బదిలీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్జిలను బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు రిజిస్టర్ జనరల్ రాజీవ్ భారతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ బదిలీలను ప్రకటించారు. బదిలీ అయిన న్యాయమూర్తుల్లో 236 మంది అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిలు, 207 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు, 139 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు. జ్యుడిషియల్ ప్రక్రియను కట్టుదిట్టం చేయడం, రాష్ట్రంలోని న్యాయవ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో భాగంగానే ఈ సామూహిక బదిలీలు చోటుచేసుకున్నాయి.

Yogi Adityanath: యోగి రికార్డు.. యూపీలో 85 శాతం తగ్గిన హత్యలు, అత్యాచారాలు


బదిలీ అయిన న్యాయమూర్తుల్లో జడ్జి రవికుమార్ దివాకర్ కూడా ఉన్నారు. వారణాసిలోని జ్ఞానవాసి కేసుకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఇచ్చిన తీర్పు ఇటీవల ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆయనను బరేలీ నుంచి చిత్రకూట్‌కు ఆయనను బదిలీ చేశారు.


జస్టిస్ వర్మ కేసు సంచలనం కావడంతో..

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించడం, పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగుచూడటం సంచలనమైంది. దీంతో న్యాయమూర్తుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. న్యాయమూర్తుల నియామకంపై సామజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, దీనిని అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిచింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పెద్దఎత్తున న్యాయమూర్తుల బదిలీలు చేటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 09:44 PM