Share News

BJP Suspends Yatnal: కర్ణాటక ఎమ్మెల్యే యత్నాళ్‌పై బీజేపీ వేటు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:10 AM

కర్ణాటక బీజేపీలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

BJP Suspends Yatnal: కర్ణాటక ఎమ్మెల్యే యత్నాళ్‌పై బీజేపీ వేటు

బెంగళూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటక బీజేపీలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. విజయపుర సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడపాటిల్‌ యత్నాళ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను విమర్శించడం, కొన్నేళ్లుగా యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కానీ యత్నాళ్‌ తీరులో మార్పు రాకపోవడంతో చర్యలు తీసుకుంది. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ మంత్రులకు మంగళవారం బీజేపీ అధిష్ఠానం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:12 AM