Share News

Cool Drinks: తీపి శత్రువు

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:05 AM

కూల్‌డ్రింక్స్‌ తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్స్‌ రావడమే కాకుండా టైప్‌ 2 డయాబెటిస్‌, హృదయరోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Cool Drinks: తీపి శత్రువు

  • శీతలపానీయాల వల్ల ఏటా 22 లక్షల టైప్‌ 2 డయాబెటిస్‌ కేసులు

న్యూఢిల్లీ, జనవరి 13: కూల్‌డ్రింక్స్‌ తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్స్‌ రావడమే కాకుండా టైప్‌ 2 డయాబెటిస్‌, హృదయరోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తీపిపానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా దాదాపు 22 లక్షల టైప్‌ 2 మధుమేహ కేసులు, 12 లక్షల హృద్రోగ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందని అమెరికాకు చెందిన టఫ్ట్స్‌ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్‌ 2 మధుమేహుల్లో 9.8ు తీపి పానీయాల వల్లేనని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ అధ్యయనంలో తేలింది. కాగా, హార్వర్డ్‌ అనుబంధ బ్రిగాఘ్‌ మహిళా ఆస్పత్రి పోస్‌ట్‌మెనోపాజ్‌లో ఉన్న లక్ష మంది మహిళలపై 20 ఏళ్ల పాటు ఓ అధ్యయం జరిగింది. నెలకు 3, అంతకన్నా తక్కువ కూల్‌డ్రింక్స్‌ తాగినవారిలో 85ు ఎక్కువ లివర్‌ క్యాన్సర్‌ ప్రమాదం కనిపించింది.

Updated Date - Jan 14 , 2025 | 05:05 AM