Indian Air Force: ఎట్టకేలకు తేజ్‌సకు అమెరికా ఇంజన్లు
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:06 AM
అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఎఫ్-404 ఇంజన్ల సరఫరా ప్రారంభమైంది. హాల్ కంపెనీ భారత వాయుసేనకు తేజస్ విమానాలను త్వరలో డెలివరీ చేయనున్నది.

డెలివరీ ప్రారంభించిన జీఈ ఏరోస్పేస్
ఎఫ్-404లో మొదటిది త్వరలోనే హాల్‌కు
న్యూఢిల్లీ, మార్చి 26: తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకే-1ఏలో ఎంతో కీలకమైన ఎఫ్-404 ఇంజన్లు ఎట్టకేలకు అమెరికా నుంచి రావడం మొదలైంది. ఈ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఎఫ్-404 ఇంజన్లలో మొదటి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు పంపినట్టు అమెరికా రక్షణ రంగ కంపెనీ జీఈ ఏరోస్పేస్ వెల్లడించింది. భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) కోసం 88 తేజస్ మార్క్-1ఏ ఎయిర్‌క్రా్‌ఫ్టలు కొనుగోలుకు 2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిఅవకాశమివ్వాలని కోరితే వాయిదావేసి పారిపోయారు: రాహుల్‌గాంధీ
త్వ శాఖ హాల్‌తో రూ.48వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. గతేడాది మార్చిలోనే హాల్ వాటిని ఐఏఎ్‌ఫకు అందించాల్సి ఉంది. కానీ.. ఇంతవరకు ఒక్క విమానాన్ని కూడా డెలివరీ చేయలేదు. ఈ యుద్ధవిమానాల కోసం 99 ఇంజన్లు కావాలని జీఈ ఏరోస్పే్‌సకు హాల్ 2021లోనే ఆర్డర్ ఇచ్చింది. ఏటా కొన్ని చొప్పున అందించేలా ఒప్పందం కుదిరింది. కానీ, జీఈ ఏరోస్పేస్ ఇప్పటి వరకూ ఒక్క ఇంజన్‌ను కూడా అందించలేదు. దీంతో హాల్ కూడా ఐఏఎ్‌ఫకు తేజ్‌సలు డెలివరీ చేయలేకపోయింది.
ఇటీవలే ఈ ఇంజన్ల తయారీని ప్రారంభించిన జీఈ ఏరోస్పేస్.. మసాచుసెట్స్ సమీపంలోని లిన్‌లో ఉన్న తయారీ కేంద్రం నుంచి తొలి ఇంజన్‌ను హాల్‌కు పంపినట్టు తెలిపింది. అది వచ్చే నెల ప్రారంభంలో అది భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా యుద్ధ విమానాలు అందించడానికి జీఈ ఏరోస్పేస్, హాల్ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్-404 ఇంజన్ల సరఫరా ప్రారంభం కావడంతో హాల్ కూడా ఐఏఎ్‌ఫకు తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలు అందించేందుకు మార్గం సుగమమైందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, అడ్వాన్స్‌డ్ టోవ్‌డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ఏటీఏజీఎస్), హై మొబిలిటీ గన్ టోవింగ్ వాహనాల కొనుగోలు నిమిత్తం భారత్ ఫోర్జ్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌లతో రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం రూ.6,900 కోట్లకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..