Share News

భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య భరణం అడిగిందని..

ABN , Publish Date - Mar 30 , 2025 | 08:51 PM

చెల్లెలితో కలిసి ఆమె వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. తిమ్మప్ప బైకుపై వచ్చి ఆమెను అడ్డగించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. రాక్షసుడిలా మారిపోయి విచక్షణా రహితంగా నరికాడు. పాపం వాళ్లు ఏడుస్తున్నా వదల్లేదు.

భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య భరణం అడిగిందని..
Husband And First Wife News

‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకు బంధువవుతానని అంది మనీ, మనీ..
అమ్మ చుట్టమూ కాదు.. అయ్య చుట్టమూ కాదు.. అయినా అన్నీ అంది మనీ మనీ..

పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ, మనీ
పుట్టడానికి, పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ..

యుగాంతం వచ్చే వరకు సిరివెన్నెల రాసిన లైన్లకు.. సమాజంలో డబ్బు విలువకు తేడా రాదు. మనిషిని బతికించాలన్నా డబ్బే.. చంపాలన్నా డబ్బే. ఆ డబ్బు కోసమే ఓ వ్యక్తి తన మొదటి భార్యను చంపాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న అతడ్ని ఆమె భరణం అడగటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తమ నలుగురు పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కర్ణాటకలోని రాయచూరులో జరిగిన ఈ సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయచూరుకు చెందిన తిమ్మప్ప యాదవ్, పద్మావతికి చాలా ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. అతడు భార్యను ప్రతీ రోజూ ఇబ్బంది పెట్టేవాడు. టార్చర్ చేసేవాడు. పిల్లల కోసం ఆమె అవన్నీ సహిస్తూ వచ్చింది. కొంతకాలం తర్వాత అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో పద్మావతి భరణం డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. కోర్టు భరణం ఇవ్వాలంటూ తిమ్మప్పను ఆదేశించింది. తిమ్మప్ప కొన్ని నెలలు సరిగ్గా భరణం ఇచ్చాడు. తర్వాత ఇవ్వటం మానేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత పద్మావతితో గొడవపడ్డం మొదలెట్టాడు.


తిమ్మప్పకు ఐదు ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోనూ పిల్లలకు వాటా కావాలని ఆమె అడిగింది. పద్మావతి ప్రతీ విషయంలో అతడికి అడ్డుతగలటంతో తిమ్మప్ప తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. పద్మావతిని చంపడానికి ప్లాన్ వేశాడు. శనివారం ఆమె వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా బైకుపై అడ్డగించాడు. కత్తితో పద్మావతిపై ఆమె చెల్లెలిపై కూడా దాడి చేశాడు. కత్తి దాటికి పద్మావతి వేళ్లు విరిగి కిందపడ్డాయి. ఆమె చెల్లెలి చెయ్యి కూడా విరిగిపోయింది. ఇద్దరిపై దాడి తర్వాత అతడు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన వీరిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిమ్మప్పను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

అందాల భామతో

బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 6 మంది మృతి

UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Updated Date - Mar 30 , 2025 | 08:52 PM