Share News

Prachand Helicopters: 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు ఓకే

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:34 AM

భారత సైన్యం, వాయు సేన కోసం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల (ప్రచండ్‌)ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి కొనుగోలు చే సేందుకు శుక్రవారం భద్రతా వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Prachand Helicopters: 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు ఓకే

భారత సైన్యం, వాయు సేన కోసం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల (ప్రచండ్‌)ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి కొనుగోలు చే సేందుకు శుక్రవారం భద్రతా వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన డీల్‌ విలువ రూ.62,000 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు హెచ్‌ఏఎల్‌కు ఇదే అతిపెద్ద ఆర్డరు కావడం గమనార్హం. ఈ హెలికాప్టర్లను హెచ్‌ఏఎల్‌... కర్ణాటకలోని బెంగళూరు, తుంకుర్‌ ప్లాంట్లలో తయారు చేయనుంది. ఇక 156 హెలికాప్టర్లలో 90 భారత సైన్యానికి, మిగతావి భారత వైమానిక దళానికి కేటాయించనున్నారు. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కార్యకలాపాల కోసం వీటిని వినియోగించనున్నారు. ఇంత భారీ స్థాయి ఆర్డరును ఇవ్వడం వల్ల దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. ప్రచండ్‌ 5వేల మీటర్ల ఎత్తులో అలవోకగా లాండింగ్‌, టేక్‌ ఆఫ్‌ కాగలదు.

Updated Date - Mar 29 , 2025 | 05:34 AM