Share News

Ranya Rao Divorce: రన్యారావ్‌కు విడాకులు ఇస్తా

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:37 AM

బంగారం అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న నటి రన్యారావ్ కు విడాకులు ఇవ్వాలని ఆమె భర్త జతిన్ హుక్కేరి నిర్ణయించారు. పెళ్లి తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

Ranya Rao Divorce: రన్యారావ్‌కు విడాకులు ఇస్తా

  • మీడియాతో అమె భర్త జతిన్‌

బెంగళూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): బంగారం అక్రమ రవాణా కేసులో పరప్పన అగ్రహార జైలులో గడుపుతున్న నటి రన్యారావ్‌కు విడాకులు ఇవ్వాలని ఆమె భర్త జతిన్‌ హుక్కేరి నిర్ణయించుకున్నారు. ఆమెకు విడాకుల నోటీసు పంపుతున్నానని బెంగళూరులో బుధవారం మీడియాకు తెలిపారు. 2024 అక్టోబరు 6న ఓ బ్రోకర్‌ ద్వారా రన్యారావ్‌ను కలిశానని, అక్టోబరు 23న నిశ్చితార్థం జరిగిందని, నవంబరు 27న నగరంలోని ఓ హోటల్‌లో పెళ్లి చేసుకున్నామని ఆయన వివరించారు. పెళ్లి జరిగిన నెలరోజులకే మనస్పర్థలు వచ్చాయని, తరచూ ఆమె దుబాయ్‌కు వెళ్లి వచ్చేవారని తెలిపారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో తనను దూరం పెడుతున్నట్టు పేర్కొన్నారు. అందుకే రన్యారావ్‌కు విడాకులిస్తానన్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:37 AM