Share News

Indian Army: తూర్పు లద్దాఖ్‌ వద్ద శాశ్వత సైనిక స్థావరం

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:11 AM

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద రక్షణకు శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని భారత ఆర్మీ నిర్ణయించింది.

Indian Army: తూర్పు లద్దాఖ్‌ వద్ద శాశ్వత సైనిక స్థావరం

ఎల్‌ఏసీ రక్షణకు ‘72 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌’..ఆర్మీ నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 28: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద రక్షణకు శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని భారత ఆర్మీ నిర్ణయించింది. ఆ ప్రాంతంలో శాశ్వతంగా మోహరించేందుకు కొత్తగా డివిజన్‌ స్థాయి దళాన్ని సిద్ధం చేస్తోంది. దానికి 72 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ అని నామకరణం చేసింది. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ మొత్తాన్ని గస్తీకాస్తున్న 3వ డివిజన్‌కు అదనంగా కొత్త పదాతిదళ విభాగం పనిచేస్తుంది. ఈ కొత్త విభాగం ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ ఆధీనంలో ఉంటుంది. ఓ దళంలో 10 నుంచి 15 వేల వరకు సైనిక శక్తి ఉంటుంది. వారికి అదనంగా మరో 8 వేల మంది సహాయంగా ఉంటారు. దీనికి మేజర్‌ జనరల్‌ ర్యాంక్‌ అధికారి నేతృత్వం వహిస్తారు.

Updated Date - Mar 29 , 2025 | 06:11 AM