Share News

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌హాసన్‌!

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:44 AM

ప్రముఖ సినీనటుడు, ‘మక్కల్‌ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైనట్లు తెలిసింది. డీఎంకే సీనియర్‌ నేత, తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు మంగళవారం రాత్రి కమల్‌తో స్థానిక ఆళ్వారుపేటలోని ఎంఎన్‌ఎం పార్టీ కార్యాలయంలో అరగంటపాటు సమావేశమయ్యారు.

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌హాసన్‌!

గత ఎన్నికల్లో డీఎంకేకు కమల్‌

మద్దతు.. అప్పుడే స్టాలిన్‌ హామీ

జూలై 24న తమిళనాడులో

ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు

కమల్‌తో రాష్ట్ర మంత్రి చర్చలు

రాజ్యసభకు కమల్‌ హాసన్‌..!

చెన్నై, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు, ‘మక్కల్‌ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైనట్లు తెలిసింది. డీఎంకే సీనియర్‌ నేత, తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు మంగళవారం రాత్రి కమల్‌తో స్థానిక ఆళ్వారుపేటలోని ఎంఎన్‌ఎం పార్టీ కార్యాలయంలో అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ ఎన్నికపైనే చర్చించినట్లు సమాచారం. జూలై 24న తమిళనాట ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి డీఎంకే కూటమికి 4, అన్నాడీఎంకే కూటమికి 2 స్థానాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికలో తమ కూటమి తరఫున కమల్‌ను రాజ్యసభకు పంపించాలని స్టాలిన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కమల్‌ డీఎంకేకు మద్దతు ప్రకటించడంతో పాటు పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికల్లో కమల్‌ పార్టీ నుంచి ఎవ్వరూ పోటీ చేయలేదు. తమ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చిన కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని స్టాలిన్‌ అప్పట్లోనే హామీనిచ్చారు. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 06:14 AM