Share News

Liquor Ban: 17 మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం..క్యాబినెట్ నిర్ణయం

ABN , Publish Date - Jan 24 , 2025 | 06:00 PM

అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి.

Liquor Ban: 17 మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం..క్యాబినెట్ నిర్ణయం

భోపాల్: మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం (Liquor Ban) విధిస్తూ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మంత్రివర్గం శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం కూడా అమలవుతుంది. మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.

Maha Kumba Mela 2025 : మీరు కుంభమేళాకు వెళ్తుంటే.. ఈ 10 విషయాలు తెలుసుకోండి.. ఏ సమస్యా రాదు..


లిక్కర్ బ్యాన్ ఎక్కడెక్కడంటే..

అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి. వీటికి మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలుగా మంచి పేరుంది.


ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందగా, మైహర్ ప్రముఖ శక్తిపీఠంగా ఉంది. నర్మదా నది పుట్టుక ప్రాంతం అమర్‌కంటక్. మధ్యప్రదేశ్‌లో కృష్ణ భగవానుడు, శ్రీరాముడు ఎక్కడెక్కడ అడుగుపెట్టారో అక్కడ ఈ మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసే దిశగా తొలుత 17 సిటీల్లో మద్యం దుకాణాలను మూసేస్తున్నట్టు చెప్పారు. వీటిని వేరేచోటుకు తరలించేది లేదని, శాశ్వతంగా మతపడతాయని వివరించారు.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 24 , 2025 | 06:00 PM