Share News

Viral Video: తప్పతాగి నడిరోడ్డు మీద పడిపోయిన టీచర్..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:16 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. బుద్ధి లేని పని చేసి నవ్వుల పాలవుతున్నాడు. తప్పతాగి సోయి లేకుండా రోడ్డు మీద పడిపోయాడు. లేపినా లేవడం లేదు. అంతలా మద్యం మత్తులో తూలుతున్నాడు.

Viral Video: తప్పతాగి నడిరోడ్డు మీద పడిపోయిన టీచర్..
Madhya Pradesh Teacher

ఒకప్పుడు మన సమాజంలో గురువును దైవంగా భావించి.. ఎంతో గౌరవంగా చూసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తనా తీరు మారడంతో.. వారిపై మర్యాద తగ్గేలా చేస్తుంది. ఒకప్పుడు టీచర్ విద్యార్థులందరిని తనబిడ్డలుగా భావించి వారికి విద్యాబుద్ధులు నేర్పించేవాడు. కానీ నేటి కాలంలో కొందరు టీచర్లు బుద్ధి లేని పనులు చేసి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. మద్యం, పొగతాగడం వంటి అలవాట్ల వల్ల కలిగే నష్టాల గురించి పిల్లలకు పాఠాలు బోధించాల్సి టీచరే.. సోయి లేకుండా తప్ప తాగి రోడ్డు మీద పడిపోయిన ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..


ఈ సంఘటన మధ్యప్రదేశ్, రేవా జిల్లాలో చోటు చేసుకుంది. పూటుగా తాగిన ఓ ఉపాధ్యాయుడు ఒంటి మీద ఏమాత్రం స్పృహ లేకుండా.. లేచి స్టడీగా నిలబడలేనంత దారుణంగా తాగాడు. మత్తు బాగా ఎక్కడంతో.. నిలబడలేక.. రోడ్డు మధ్యలో పడిపోయాడు. అసలు తాను ఎక్కడ ఉన్నాడు.. ఎలాంటి స్థితిలో ఉన్నాడనే విషయం కూడా గమనించే పొజిషన్‌లో లేడు.

ఈ ఘటన పోలీసు స్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్న కొందరు ఉపాధ్యాయుడిని గమనించి.. ఆరోగ్యం బాగోలేక కింద పడిపోయుంటాడని భావించి.. అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఆ తర్వాతే వారికి తెలిసింది.. అతడు ఫుల్లుగా తాగి సోయి లేకుండా పడిపోయాడని.


ఇక ఆ వ్యక్తి గురించి ఆరా తీయడంతో.. అతడు రేవా జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీజీ కాలేజీలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీనిపై స్పందిచిన కాలేజీ ప్రిన్సిపాల్.. ఈ విషయాన్ని హైరింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువే.. ఇలా తప్ప తాగి రోడ్ల మీద పడిపోవడం ఏంటి.. ఇలాంటి వ్యక్తి పిల్లలకు ఏం పాఠాలు నేర్పుతాడని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

పిల్లల ముందే పొట్టుపొట్టు కొట్టుకున్న టీచర్లు

లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Updated Date - Mar 30 , 2025 | 04:46 PM