Share News

విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిన వైసీపీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:46 AM

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు.

విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిన వైసీపీ
డీఈఓ, ఎంఈఓలతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి

నాడు- నేడు నిధులు దుర్వినియోగం

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మున్సి పల్‌ కార్యాలయంలో డీఈవో శ్యాముల్‌ పాల్‌, మూడు మండలాలు, పట్టణం ఎంఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయా మండలాల్లో పాఠశాలలు, విద్యార్థులతో పాటు వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలల విలీనం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులను విద్యకు దూరం చేసిందన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 53800మంది విద్యార్థులు డ్రాపౌట్‌ అయ్యారన్నారు. యువ గళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే జీఓ నెం 117ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రద్దు చేశారన్నారు. ప్రతిపక్ష వైసీపీ ఇటీవల కాలంలో విషప్ర చారం చేస్తోందని మండిపడ్డారు. పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠ శాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని విలేకరులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా ఎమ్మెల్యే బీవీ స్పందిస్తూ.. గ్రామాల్లోనూ, పట్ట ణంలో ఉన్న పాఠశాలల స్థలాలను ఎరైన అక్రమించినా, కబ్జాలకు పాల్పడిన సహించేది లేదన్నారు. అటువంటివి ఉన్నట్లైతే వెంటనే చర్య లు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మిగనూరు, నందవరం, గోనేగండ్ల ఎంఈఓలు ఆంజనేయులు, మధుసూధనరాజు, రఘునాథ్‌, రామాంజనేయులు, నీలకంఠ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:46 AM