అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:44 AM
ప్రజాపాలన పేరుతో తెలం గాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల నాయులతోపాటు పార్టీల నాయకులను ముందుస్తు అరెస్ట్ చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాల్లారపు ప్రశాంత్ అన్నారు.

సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన పేరుతో తెలం గాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాల నాయులతోపాటు పార్టీల నాయకులను ముందుస్తు అరెస్ట్ చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాల్లారపు ప్రశాంత్ అన్నారు. తమ పాలనలో నిర్బంధాలు ఉండవని ప్రగతి భవనం కంచెలు తీసివేసి ఇప్పుడు ప్రజల మీదనే నిర్భంధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తుందని తక్షణమే అరెస్ట్ చేసి నాయకులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఉస్మానియ యూనివర్సీటీకి సంబం ధించిన 400 ఎకరాల భూములను వేలంగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారని ఈ క్రమంలో హెచ్‌సీయూ భూములను అమ్ముకునేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్‌లు, జేసీబీలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నాను. జేసీబీలను అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించడం, పోలీసు బలగాలతో యునివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘటనలకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే పోలీసులు అర్ధరాత్రి ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఇళ్లపై దాడులు చేసి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కళ్యాణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు జూలపల్లి మన్‌జ్‌కుమర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్‌కుమార్‌లతో పాటు ఇతర నాయకులను పోలీస్‌లు ముందస్తు అరెస్ట్‌లు చేశారన్నారు. అరెస్ట్‌లు చేసిన వారిని వెంటనే విడు దల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటి నాయకులు శివ,సాయి, భరత్, రాహూల్, మహేష్‌లు పాల్గొన్నారు.