Lion: జూలో మగ సింహం మృతి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:49 PM
జూలో మగ సింహం మృతిచెందింది. ‘వీరా’ అనే మగ సింహం గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. అది నడుము వద్ద కండరాల లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దానికి చికిత్స అందిస్తున్నటికీ శనివారం మృతిచెందింది.

చెన్నై: వండలూరు(Vandaluru) అరింజర్ అన్నా జంతు ప్రదర్శనశాలలో ‘వీరా’ మగ సింహం తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందింది. రాఘవ అనే మగసింహం, కవితా అనే ఆడ సింహానికి 2011లో వీరా జన్మించింది. పుట్టినప్పటి నుండే ఈ సింహం(Lion) నడుము వద్ద కండరాల లోపంతో బాధపడింది. గత నెల రోజులుగా లేచి నడవలేని స్థితికి చేరింది. జంతు ప్రదర్శన శాల వైద్యులు, వెటర్నరీ విశ్వవిద్యాలయం(Veterinary University) వైద్య నిపుణులు చికిత్సలందిస్తూ వచ్చారు. శుక్రవారం చికిత్స ఫలించక మృతి చెందింది.
ఈ వార్తను కూడా చదవండి: Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News