Share News

Bijapur District : ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన నక్సల్స్‌

ABN , Publish Date - Feb 05 , 2025 | 06:09 AM

బీజాపుర్‌ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్‌ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Bijapur District : ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన నక్సల్స్‌

  • పోలీస్‌ ఇన్‌ఫార్మర్లకు ఇదే గతి అంటూ హెచ్చరిక లేఖ

చింతూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించారంటూ ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్న వారందరికీ ఇదే శిక్ష పడుతుందంటూ ఓ హెచ్చరిక లేఖను సంఘటనా స్థలంలో వదిలివెళ్లారు. బీజాపుర్‌ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్‌ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాయుధ మావోయిస్టులు బుడిగిచెర్వు చేరుకున్నారు. గ్రామానికి చెందిన కారం రాజు(32), మడ్వి మున్నా(27)లను వారి ఇళ్లనుంచి గ్రామ శివారుకు తీసుకెళ్లి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 05 , 2025 | 06:11 AM

News Hub