Share News

Kishan Reddy: ప్రజలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:25 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌పై ప్రజలను మోసం చేశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ విజయం కోసం ఉద్యమాలు నిర్వహించాలనీ, జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

Kishan Reddy: ప్రజలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు

హామీల అమలుపై చేతులెత్తేసింది ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను నిలదీద్దాం

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, హామీల అమలు కోసం కాంగ్రె్‌సపై ఒత్తిడి తీసుకురావాలని, ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు బలపడాలంటే... బీజేపీని గెలిపించాలన్న నినాదంతో స్థానిక ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఏప్రిల్‌ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో గావ్‌ ఛలో, బస్తీ చలో అభియాన్‌ కార్యక్రమాలు, స్వచ్ఛతా అభియాన్‌ కార్యక్రమం ద్వారా కేంద్ర పథకాల లబ్థిదారులతో సమవేశాలు, వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ జనజాగరణ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా.. రెండు సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేశారు. బీజేపీ బలపడాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటురని పేర్కొన్నారు. జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆ పరిధిలోని పార్టీ జిల్లా అధ్యక్షులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:25 AM