Ramappa Temple: టూరిజం హబ్‌గా రామప్ప
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:28 AM
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం ద్వారా రూ.73.74 కోట్లు మంజూరు చేసింది. ఆలయం, సరస్సు, కోటగుళ్లు, చెరువు ప్రాంతాలు టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.

సాస్కి స్కీం ద్వారా కేంద్రం రూ.73 కోట్లు మంజూరు
త్వరలోనే టూరిజం సర్క్యూట్‌గా రూపకల్పన
వెంకటాపూర్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం ద్వారా రూ.73.74కోట్లు మంజూరు చేసింది. రామప్ప ఆలయానికి పక్కనే సరస్సు, దాని సమీపంలో భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగుళ్లు, చెరువు ఇతర ప్రదేశాలను ఓ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసి పలు సౌకర్యాలు కల్పించబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
చేపట్టే పనులు ఇవే!
రామప్ప సర్క్యూట్‌లో టూరిస్టులు సౌకర్యంగా బస చేయడానికి కాటేజీలతోపాటు హస్తకళ బజార్, శిల్పాల గార్డెన్, ఆంపి థియేటర్, లేక్‌వ్యూ కాటేజీలు, బొటానికల్ గార్డెన్, పిల్లల ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు. రామప్ప ఆలయం, కాకతీయ రుద్రేశ్వరస్వామి సర్క్యూ ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, రామప్ప ద్వీపం, గణపేశ్వరాలయం కోటగుళ్లు, గణప సముద్రం చెరువు, ఇంచర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రామప్ప, కోటగుళ్లు దేవాలయాల్లో శిల్పతోట, పిల్లల ఉద్యానవనం, మండపానికి పైకప్పు, ల్యాండ్ స్కేపింగ్ ఉం టాయి. రామప్ప ద్వీపంలో థీమ్ ప్లాజా, సీతాకోకచిలుక తోట, ఆటస్థలం, ట్రెక్కింగ్, ఫొటోగ్రఫీ పాయింట్, బోటింగ్ సదుపాయాలు ఉంటాయి.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News