Waqf Bill Support: వక్ఫ్ సవరణ బిల్లుకు బిష్‌పల సంఘం మద్దతు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:16 AM
కేంద్రమంత్రిత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణలకు కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) మద్దతు ప్రకటించింది. కేరళలో వక్ఫ్ బోర్డు వివాదాలకు పరిష్కారం చూపించడానికి ఈ చట్ట సవరణను తప్పనిసరి అనుకుంటున్నట్టు పేర్కొంది

న్యూఢిల్లీ, మార్చి 31: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్టం సవరణలకు సోమవారం కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) మద్దతు తెలిపింది. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అన్ని పార్టీలను కోరింది. వక్ఫ్ బిల్లు ఆమోదం పొందేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో క్రైస్తవ సంఘం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుత చట్టంలోని నిబంధనలను ఉపయోగించుకొని కేరళ వక్ఫ్‌బోర్డు మునాంబాం ప్రాంతంలోని 600కుపైగా కుటుంబాల ఇళ్లను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిందని తెలిపింది. తరాలుగా నివసిస్తున్న వారి ఇళ్లను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడంపై మూడేళ్లుగా న్యాయపోరాటం కొనసాగుతోందని పేర్కొంది. ఇలాంటి వివాదాల పరిష్కారానికి చట్ట సవరణే ఏకైక మార్గమని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News