Share News

Navodaya Vidyalaya results: ‘నవోదయ’ ఎంట్రెన్స్‌ ఫలితాలు వెల్లడి

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:37 AM

నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ద్వారా ఫలితాలను చూడవచ్చు. అలాగే, కేంద్రీయ విద్యాలయాలలో మొదటి తరగతి ప్రవేశాల లాటరీ ఫలితాలు ప్రకటించబడ్డాయి.

Navodaya Vidyalaya results:  ‘నవోదయ’ ఎంట్రెన్స్‌ ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 25: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పర్వత ప్రాంతాలు మినహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పరీక్షలను ‘నవోదయ విద్యాలయ సమితి’ 2025 జనవరి 18న నిర్వహించింది. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన తమ రోల్‌నెంబర్‌, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఖాళీలను బట్టి అడ్మిషన్ల కోసం నవోదయ విద్యాలయాల్లో రెండు వెయిటింగ్‌ లిస్ట్‌లను రూపొందిస్తారు. ఎంపికైనా చేరనివారు, సరైన తేదీలోగా సర్టిఫికెట్లను సమర్పించలేని వారి స్థానంలో మిగతా వారికి అవకాశం ఇస్తారు.


కేవీ లాటరీ ఫలితాలు వచ్చాయి

కేంద్రీయవిద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాల లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటికి సంబంధించి మార్చి 7నుంచి 21వరకు దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు దారులు తమ పిల్లలు ఎంపికయ్యారో లేదో తెలుసుకునేందుకు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు. విద్యార్థుల ధ్రువపత్రాలను వెరిఫై చేశాక అడ్మిషన్‌ ఫైనల్‌ అవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:38 AM