SRH vs LSG Playing 11: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:04 PM
Indian Premier League: ఉప్పల్‌లో మరో జాతరకు రంగం సిద్ధమైంది. తమకు ఇష్టమైన ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్‌ను వేటాడేందుకు రెడీ అవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండో పోరులో భాగంగా లక్నో సూపర్ జియాంట్స్‌తో ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం మిషన్ 300 రీచ్ అయ్యే చాన్స్ ఉండటమే. ఎల్‌ఎస్‌జీపై రెచ్చిపోయి ఆడే కమిన్స్ సేన.. మూడొందల పరుగుల మార్క్‌ను ఇవాళ్టి మ్యాచ్‌లో రీచ్ కావాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
అదే ప్లాన్‌తో..
తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంతో అదే జట్టును రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట సన్‌రైజర్స్ సారథి కమిన్స్. కాబట్టి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్, సెకండ్ డౌన్‌లో నితీష్ రెడ్డి ఆడతారు. విధ్వంసక హెన్రిక్ క్లాసెన్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. కుర్రాళ్లు అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ ఫినిషర్ రోల్స్ పోషిస్తారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహ్మద్ షమి పేస్ బాధ్యతలు చూసుకుంటారు. వీళ్లకు తోడుగా సిమర్జీత్ కూడా బరిలోకి దిగే చాన్స్ ఉంది. స్పిన్నర్లు ఆడమ్ జంపా, అధర్వ టైడేలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతారు.
మార్పులు ఖాయం
మొదటి మ్యాచ్‌లో ఓడిన లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా మార్క్రమ్, మార్ష్ ఆడతారు. ఫస్ట్ డౌన్‌లో పూరన్, సెకండ్ డౌన్‌లో ఆయుష్ బదోని దిగడం ఖాయం. కెప్టెన్ పంత్ 5వ నంబర్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ రోల్ చూసుకుంటాడు. శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠి పేస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటారు. షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ స్పిన్ విభాగాన్ని నడిపిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవేశ్ ఖాన్‌ను దింపే సూచనలు కనిపిస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమి, సిమర్జీత్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ - ఆడమ్ జంపా/అథర్వ టైడే
లక్నో సూపర్‌జియాంట్స్ (అంచనా): ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
ఇంపాక్ట్ ప్లేయర్ - ఆవేశ్ ఖాన్/అబ్దుల్ సమద్.
ఇవీ చదవండి:
పాయింట్స్ టేబుల్‌లో ఊహించని ట్విస్ట్
24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి