Share News

Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:48 PM

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు.

Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత
Local Body Elections in AP

అమరావతి: ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు గురువారం ఎన్నికలు (AP Local Body Elections) జరుగుతున్నాయి. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 28 ఎంపీపీలు (MPP), 23 వైస్ ఎంపీపీ (Vice MPP) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కూటమి (Kutami), వైసీపీ (TCP) మధ్య పోటీ నెలకొంది. కాగా కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి తాము పోటీ చేయడం లేదని టీడీపీ కూటమి ప్రకటించింది. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎవరు ఎంపీపీగా ఎన్నిక అవుతారన్న ఉత్కంఠత కలిగిస్తోంది.

Also Read..: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్


పశ్చిమగోదావరి జిల్లా.. అత్తిలిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీకి చెందినవారు కారుమూరి నివాసం నుండి ఎంపీటీసీలతో వెళుతుండగా అక్కడ వారిని టీడీపీ కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. కాగా మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా: బిక్కవోలు మండలం బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు. ఏపీలోనే తొలి బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ గెలిచారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తేతలి సుమను అభినందించారు.

కడప జిల్లా: ఉమ్మడి కడప జడ్పీచైర్మెన్ గా వైసీపీకి చెందిన రామగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ఒకే నామినేషన్ రావడంతో ఎన్నికైనట్లు కలెక్టర్ వెల్లడించారు. కడప పరిషత్ ఛైర్మన్ పదవికి తాము పోటీ చేయడం లేదని టీడీపీ కూటమి ప్రకటించింది. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జడ్పీ చైర్మన్‌గా రామ గోవిందరెడ్డి చేత కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు.


అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం, నారపాడులో వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. గతంలో వైస్ ఎంపీపీగా ఉన్న చొక్కాకుల గోవింద్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దానికి ఈ రోజు ఎన్నిక జరుగుతోంది. దీంతో ఎంపీటీసీలు జనసేన అభ్యర్థి మామిడి లక్ష్మిని వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండల ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయ అధికారులు సర్వం సిద్దం చేశారు. మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా వైసీపీ 13 గెలిపోందగా టీడీపీ ఒకరు గెలుపొందారు. వైసీపీ నుండి ఒకరు టీడీపీలోకి చేరారు. దీంతో ప్రస్తుతం టీడీపీకి ఇద్దరు, వైసీపీకి 12 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది.

ఏలూరు జిల్లా: కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసిపి మధ్య పోటీ నెలకొంది. మొత్తం 22 మంది ఎంపీటీసీలకు ఒకరు మరణించగా, మరొకరు రాజీనామా చేయగా 20 మంది మధ్య పోటా పోటీ నెలకొంది. కూటమికి పది వైసీపీకి పది మంది ఉండటంతో పోటీ ఉత్కంఠతగా మారింది. ఎన్నిక జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

గుంటూరు జిల్లా చెరువులో దిగి టెన్త్ విద్యార్థి మృతి

కుప్పకూలిన భవనం ఘటన.. చికిత్స పొందుతూ మేస్త్రీ మృతి..

For More AP News and Telugu News

Updated Date - Mar 27 , 2025 | 01:48 PM